Home Film News Allu Arjun Gift: అల్లు అర్జున్ త‌క్కువోడేం కాదు.. పెళ్లికి ముందు ఆమెకి అంత ఖ‌రీదైన గిఫ‌ట్ ఇచ్చాడా..!
Film News

Allu Arjun Gift: అల్లు అర్జున్ త‌క్కువోడేం కాదు.. పెళ్లికి ముందు ఆమెకి అంత ఖ‌రీదైన గిఫ‌ట్ ఇచ్చాడా..!

Allu Arjun Gift: గంగోత్రి సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆ త‌ర్వాత ఆర్య సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారారు. చిత్రంలో బ‌న్నీ న‌ట‌న‌, డ్యాన్స్‌కి అయితే దేశ విదేశాల‌కి చెందిన సినీ ప్రియులు, క్రికెట‌ర్స్, రాజ‌కీయ నాయ‌కులు ఫిదా అయ్యారు. అంతేకాదు బ‌న్నీ మాదిరిగా అనుక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. పుష్ప సినిమాతో బ‌న్నీ పేరు దేశ‌మంత‌టా మారుమ్రోగిపోతుంది. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రోసారి దండ‌యాత్ర చేయ‌బోతున్నాడు. అయితే బన్నీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యానికి వ‌స్తే ఆయ‌న స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రు చాలా అన్యోన్యంగా ఉంటారు. వీరి దాంప‌త్యంలో ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు.

అయితే  బన్నీ భార్య స్నేహ రెడ్డికి హీరోయిన్ కు మించిన అందం ఉంటుంది. అలానే ఆమెకు.. హీరోయిన్ కు ఉన్న క్రేజ్ కూడా  ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. అల్లు అర్జున్ ఫోటోస్, వీడియోస్ తో పాటు.. అటు కూతురు అర్హ, కొడుకు ఆయన్ ఫోటోలు కూడా పోస్ట్ చేస్తూ నెటిజ‌న్స్ ని అల‌రిస్తూ ఉంటుంది.. అయితే పెళ్లికి ముందు  అల్లు అర్జున్ తల్లి స్నేహారెడ్డికి ఓ కండీష‌న్ పెట్టింద‌ట‌. బ‌న్నీ త‌ల్లి త‌మ బంధువుల్లో  ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోగా,  అప్పటికే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని ప్రేమించడంతో చేసేదేం లేక ఇది ఒప్పుకుంటే మీ పెళ్లికి ఒప్పుకుంటాన‌ని బ‌న్నీ త‌ల్లి నిర్మ‌ల చెప్పింద‌ట‌.

అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకున్న తర్వాత రెండు మూడు సంవత్సరాల లోపే పిల్ల‌ల‌ని క‌నాల‌ని,  గ్యాప్ తీసుకుంటాం.. అంటే కుదరదు అని చెప్పార‌ట‌. ఆమె ఒపుకోవ‌డంతో నిర్మ‌ల గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం  పెళ్లి జ‌ర‌గ‌డం అయిపోయింది. ఇక స్నేహారెడ్డిని మొద‌టి నుండి ఎంతో ఇష్ట‌ప‌డ్డ బ‌న్నీ.. పెళ్లికి ముందు ఆమెకి ఖ‌రీదైన బ‌హుమ‌తుల‌ని గిఫ్ట్‌గా ఇచ్చేవాడ‌ట‌. ఎంగేజ్‌మెంట్‌కి ఒక రోజు ముందు అల్లు అర్జున్  తన కి కాబోయే భార్య స్నేహ రెడ్డి దగ్గరికి వెళ్లి  ఎంగేజ్మెంట్ కు కట్టుకునే సారీ,  దాదాపు లక్షకు పైగా ఖరీదు చేసే డిజైనర్ సారీ ని గిఫ్ట్ గా ఇచ్చారట.  తమ ప్రేమకి గుర్తుగా దాదాపు 40 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ ని కూడా అందించిన‌ట్టు స‌మాచారం. ఎంగేజ్మెంట్ రోజు వేసుకోవడానికి దాదాపు 60 లక్షల ఖరీదు చేసే ఆభరణాలను కూడా ప్రేమతో ఇచ్చాడ‌ని అంటున్నారు. ఇది విన్న పెళ్లైన యువ‌తులు మా భ‌ర్త కూడా మాకు ఇలా ఇచ్చి ఉంటే బాగుండేది అని అనుకుంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...