Home Film News Sai Pallavi: ప‌ద్ద‌తిగా క‌నిపించే సాయి ప‌ల్ల‌వి సిగ‌రెట్ తాగుతుందా..ఇందులో నిజ‌మెంత?
Film News

Sai Pallavi: ప‌ద్ద‌తిగా క‌నిపించే సాయి ప‌ల్ల‌వి సిగ‌రెట్ తాగుతుందా..ఇందులో నిజ‌మెంత?

Sai Pallavi: మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సాయి ప‌ల్ల‌వి గురించి తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు లేరంటే అతిశ‌యోక్తి కాదు. ఫిదా సినిమాలో త‌న న‌ట‌న‌తో, డ్యాన్స్‌తో ప్ర‌తి ఒక్క‌రిని మంత్ర ముగ్ధుల‌ని చేసింది సాయి ప‌ల్ల‌వి. ఈ అమ్మ‌డి ప‌క్క‌న ఎలాంటి స్టార్ హీరో న‌టించిన‌ప్ప‌టికీ అంద‌రి దృష్టి సాయి ప‌ల్ల‌వి పైనే ఉంటుంది. లేడి ప‌వ‌ర్ స్టార్‌గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న సాయి ప‌ల్ల‌వి ఇప్పుడు వైవిధ్య‌మైన సినిమాలు చేస్తుంది.  క్లీన్ ఇమేజ్ ఉన్న సాయి ప‌ల్ల‌వి  ఇప్పటి వరకు తాను చేసిన ఏ సినిమాలో కూడా హద్దులు మీరలేదు.  అందాలను ఎక్స్ పోజింగ్ చేయ‌డం, లిప్ లాక్ లాంటివి చేయ‌క‌పోవ‌డం వ‌లన అందరూ కూడా  ఆమెను విపరీతంగా అభిమానిస్తూ ఉంటారు.

ఎప్పుడు చాలా ప‌ద్దతిగా కనిపించే సాయి ప‌ల్ల‌వి సిగ‌రెట్ తాగిందంటూ ఓ ప్ర‌చారం ఇప్పుడు నెట్టింట మొద‌లైంది. ఇది విని అంద‌రు షాక్ అవుతున్నారు. సాయి ప‌ల్ల‌వి సిగ‌రెట్ తాగడం ఏంటి అని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే.. సాయి పల్లవి ఎంబిబిఎస్ చదివిన సంగతి మనందరికీ తెలిసిందే.గ‌తంలో ఈ అమ్మ‌డు చాలా సార్లు సినిమాల‌లోకి రాక‌పోయి ఉంటే, డాక్ట‌ర్ అయ్యేదాన్ని అని చెప్పింది. ఓ సారి కాలేజ్‌లో  సాయి పల్లవి   పొగ తాగకూడదు అనే విషయంకి సంబంధించిన‌ అవేర్నెస్ కార్యక్రమంలో  డమ్మీ సిగరెట్ ని తాగి అక్కడ ఉన్న వాళ్లందరికీ చూపించిందట. ఆ స‌మ‌యంలో సాయి ప‌ల్ల‌వి ప‌ర్ఫార్మెన్స్ ని అంద‌రు మెచ్చుకున్నారు.

అయితే  అప్పటి నుంచే నాకు నటన మీద ఆసక్తి కలిగింది అంటూ చెప్పుకొచ్చింది సాయి పల్లవి. గ‌తంలో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కమర్షియల్ మసాలా సినిమాలకు దూరంగా ఉంటున్న సాయి ప‌ల్ల‌వికి  చిరంజీవి భోళా శంకర్ సినిమాలో నటించే అవకాశం రాగా, దానిని కూడా తిరస్కరించింది. అంతే కాదు అజిత్, విజయ్ సినిమాల అవకాశాలను కూడా సున్నితంగా తిర‌స్క‌రించింది. ఈ అమ్మ‌డు కథానాయిక పాత్రలకు  స్కోప్ ఉన్న సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఈ కార‌ణం వ‌ల్ల‌నే పెద్ద స్టార్ నటుల సినిమాలను కూడా ఆమె ఈజీగా తిరస్కరించేస్తుంది.

Related Articles

Игровые аппараты Pin-up casino на деньги

Игровые аппараты Pin-up casino на деньги

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...