Home Film News Sankranti: సంక్రాంతి బ‌రిలో ఐదు పెద్ద సినిమాలు.. ఇక బాక్సాఫీస్ ద‌గ్గర ప్ర‌కంప‌న‌లే..!
Film News

Sankranti: సంక్రాంతి బ‌రిలో ఐదు పెద్ద సినిమాలు.. ఇక బాక్సాఫీస్ ద‌గ్గర ప్ర‌కంప‌న‌లే..!

Sankranti: సంక్రాంతికి ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌మ సినిమాల‌ని విడుద‌ల చేసి మంచి లాభాలు ఆర్జించాల‌ని భావిస్తుంటారు. ప్ర‌తి సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుద‌ల అవుతుండ‌గా, అవి మంచి ఆద‌ర‌ణ కూడా నోచుకుంటాయి. గత సంక్రాంతికి చిరు, బాల‌య్య తెగ సంద‌డి చేయ‌గా, ఈ సారి ఐదు బ‌డా సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. దీంతో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ద‌క్క‌డం ఖాయం. కాక‌పోతే  థియేటర్స్ పంచాయితీ షురూ మాత్రం ఖాయం. ఇప్ప‌టికే  తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్ మూతబడ్డాయి. ఉన్న కొద్ది థియేటర్స్ పై కూడా  గుత్తాధిప‌త్యం ఎక్కువ‌గా ఉంది. దిల్ రాజు స‌ర్దుబాటు వ్య‌వ‌హారంతో అనేక స‌మస్య‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

దిల్ రాజు 2024  సంక్రాంతికి  విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రాన్ని   విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.  దీంతో సంక్రాంతి బ‌రిలో రానున్న సినిమాలు థియేటర్స్ గురించి ఆలోచించే ప‌రిస్థితి వ‌చ్చింది.  మహేష్ బాబు గుంటూరు కారం , రవితేజ ఈగిల్, తేజా సజ్జా హనుమాన్, విజయ్ దేవరకొండ 13  చిత్రాలు వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రానున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. ఇక వీటితో పాటు టాలీవుడ్ సీనియ‌ర్ హీరో నాగార్జున నా సామిరంగ అంటూ కొత్త మూవీ ప్రకటించగా, దీనిని  పెద్ద పండగకు తెస్తున్న‌ట్టు క్లారిటీ ఇచ్చారు.  ఇక ప్రభాస్ కల్కి కూడా సంక్రాంతికి అని ముందు ప్ర‌క‌టించారు కాని అది జూన్/జులై కి వాయిదా పడినట్లు తెలుస్తుంది.

ఈ ఐదు చిత్రాల‌కే థియేట‌ర్స్ అడ్జెస్ట్ కాని ప‌రిస్థితి. అదే స‌మ‌యంలో ఒక‌టో రెండో డ‌బ్ చిత్రాలు కూడా రిలీజ్ కానున్నాయి.  మా సినిమాల విడుదలని అడ్డుకుంటే తెలుగు సినిమాలు తమిళనాడులో ఆడనివ్వమని లొల్లి చేయ‌డం మనం చూశాం. దీంతో వారి సినిమాల‌కి థియేట‌ర్స్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి. మరి సంక్రాంతి బ‌రిలో నిలిచిన సినిమాల‌న్నీ పెద్ద‌వే. ఏ హీరో సినిమాకి త‌క్కువ థియేట‌ర్స్ ఇచ్చే ప‌రిస్థితి లేదు. మ‌రి ఈ ట్రాఫిక్ స‌మ‌స్య ఎలా తీరుతుందో చూడాలి.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...