Home Film News Venu Madhav-Rajamouli: ఏంటి .. వేణు మాధ‌వ్‌కి అసిస్టెంట్‌గా రాజ‌మౌళి ప‌ని చేశాడా..!
Film News

Venu Madhav-Rajamouli: ఏంటి .. వేణు మాధ‌వ్‌కి అసిస్టెంట్‌గా రాజ‌మౌళి ప‌ని చేశాడా..!

Venu Madhav-Rajamouli: రాజ‌మౌళి.. ఇప్పుడు ఈ పేరు తెలియ‌ని వారు లేరు. ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి బాహుబ‌లి సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ అందుకున్నాడు. ఆయ‌న ఇటీవ‌ల చేసిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌డా హిట్ కొట్టింది.దీంతో రాజ‌మౌళి పేరు ప్ర‌ఖ్యాత‌లు అంతార్జాతీయంగా మారు మ్రోగిపోతున్నాయి. శాంతినివాసం అనే సీరియల్ తో డైరెక్టర్‌గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత కొన్ని చిత్రాల‌కి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు. ఎన్టీఆర్ న‌టించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయమైన రాజమౌళి ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ డ‌మ్ ద‌క్కించుకున్నాడు. అయితే రాజ‌మౌళికి సంబంధించి ఇటీవ‌ల అనేక విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా క‌మెడీయ‌న్ వేణు మాధ‌వ్‌కి అసిస్టెంట్‌గా రాజ‌మౌళి చేసిన‌ట్టు ఓ వార్త నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

వేణు మాధ‌వ్‌కి రాజ‌మౌళి అసిస్టెంట‌గా చేయ‌డ‌మేంట‌ని అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇందుకు సంబంధించి ఆరాలు కూడా తీస్తున్నారు. అయితే అస‌లు వాస్త‌వం ఏంటంటే.. రియ‌ల్ లైఫ్‌లో కాకుండా రీల్ లైఫ్‌లో మాత్ర‌మే రాజ‌మౌళి అలా చేశాడ‌ట‌. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో సై సినిమా ఒకటి కాగా, ఈ సినిమాని చాలా రిచ్ గా తీసారు రాజమౌళి. ఇందులో హీరోగా నితిన్ చేయగా.. నల్లబాలు పాత్రను వేణు చేసి మెప్పిస్తాడు. అయితే నల్లబాలుకి అసిస్టెంట్ డైరెక్టర్గా దర్శనమిస్తాడు జక్కన్న. ఈ పాత్ర కేవలం సెకండ్ల పాటు మాత్రమే ఉండ‌గా, ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట వైర‌ల్‌గా ఉంది. ఈ వార్త వైర‌ల్‌గా మార‌డంతో సినిమాలో ఎక్క‌డ క‌నిపిస్తాడా అని వెత‌క‌డం మొద‌లు పెట్టేశారు.

 

అపజయమెరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి.. కోట్లాదిమంది ఇండియన్స్ ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డును సైతం తీసుకొచ్చారు . ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట‌కి ఆస్కార్ రావ‌డంతో ప్ర‌తి ఒక్క భారతీయుడు కూడా గ‌ర్వించారు. ఇప్పుడు ఆయ‌న మ‌హేష్ బాబుతో సినిమా చేసే ప‌నిలో ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆ సినిమాకి సంబంధించిన ప‌నులు చూసుకుంటున్నాడు. అడ్వెంచ‌ర‌స్ చిత్రంగా భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...