Home Film News Rajinikanth: ఇది క‌దా ర‌జ‌నీకాంత్ అంటే.. ఆయ‌న సినిమా రిలీజ్ రోజు వారికి సెల‌వు..!
Film News

Rajinikanth: ఇది క‌దా ర‌జ‌నీకాంత్ అంటే.. ఆయ‌న సినిమా రిలీజ్ రోజు వారికి సెల‌వు..!

Rajinikanth: త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తూ ఉంటారు. ఏడు ప‌దుల వ‌య‌స్సు దాటిన కూడా త‌న అభిమానుల కోసం ఎంతో క‌ష్ట‌ప‌డుతూ సినిమాలు చేస్తున్నారు త‌లైవా. ఆయ‌న సినిమా రిలీజ్ రోజున థియేటర్స్ దగ్గర పెద్ద పండుగ వాతావరణం కనిపిస్తుంది.గ‌త కొద్ది రోజులుగా ర‌జనీకాంత్ నుండి ఒక్క హిట్ కూడా రాలేదు. అయిన‌ప్ప‌టికీ కూడా ఆయ‌న సినిమా వ‌స్తుందంటే మాత్రం అభిమానులు క‌ళ్ల‌ల్లో కొవ్వొత్తులు వేసుకొని ఎదురు చూస్తుంటారు.

తాజాగా జైల‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాడు ర‌జ‌నీకాంత్. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా.. ఆగష్టు 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన పాటలు, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలు సినిమాపై ఓ రేంజ్‌లో అంచ‌నాలు పెంచాయి. అనిరుధ్ అందించిన పాటలు జనాల నోళ్లలో తెగ నానుతున్నాయి. త‌మ‌న్నా పాట‌కి అయితే సెల‌బ్రిటీలు కూడా రీల్స్ చేస్తున్నారు. ఈ సినిమాతో ర‌జ‌నీకాంత్ మంచి హిట్ కొట్ట‌డం ఖాయంగా భావిస్తున్నారు. అయితే సినిమాని తొలి రోజు తొలి షో చూసేందుకు ఫ్యాన్స్ తో పాటు కామ‌న్ ఆడియ‌న్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఈ క్ర‌మంలోనే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొన్ని కంపెనీలు వారి అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. జైలర్ రిలీజ్ రోజు కొన్ని కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కి హాలిడే ఇవ్వనున్నట్లు సమాచారం. బెంగళూరు, చెన్నైకి చెందిన కొన్ని కంపెనీలు మాత్రమే ఇలా తమ ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. వారు సెల‌వే కాకుండా జైలర్ మూవీ టికెట్స్ కూడా అరేంజ్ చేస్తున్నార‌ట‌. ఈ విషయం తెలిసి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత రజినీ నుండి మాస్ యాక్షన్ మూవీ వ‌స్తుండ‌డంతో సినిమాపై ప్ర‌తి ఒక్క‌రు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు.చిత్రంలో రమ్యకృష్ణ, తమన్నాలతో పాటు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం స్టార్ మోహన్ లాల్ కీలకపాత్రలలో క‌నిపించ‌నున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...