Home Film News Bimbisara Review : బ్లాక్ బస్టర్ ‘బింబిసార’.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!
Film NewsReviews

Bimbisara Review : బ్లాక్ బస్టర్ ‘బింబిసార’.. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్!

Bimbisara Review
Bimbisara Review

Bimbisara Review: కళ్యాణ్ రామ్ హీరోగా తన హోమ్ బ్యానర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావ కె. హరికృష్ణను నిర్మాతగా.. వశిష్టను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్‌తో చేసిన మూవీ ‘బింబిసార’.. ప్రోమోస్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ‘బింబిసార’ ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం..

కథ…
త్రిగర్తల సామ్రాజ్యానికి రాజు బింబిసారుడు (కళ్యాణ్ రామ్).. అధికారానికి అహంకారం తోడైతే మనిషి మృగంలా ఎలా మారతాడో అనే దానికి ఉదహరణగా నిలిచే వ్యక్తి. తన అధికార దాహంతో చుట్టుపక్కలున్న రాజాల్యన్నిటినీ ఆక్రమించుకున్నాడు. తనకి ఎదురు చెప్తే.. చిన్నపిల్లలు, ముసలివారని చూడకుండా దారుణంగా హతమారుస్తుంటాడు. చివరికి సొంత తమ్ముణ్ణి కూడా..

అలాంటి బింబిసారుడు అనుకోని పరిస్థితుల్లో భూలోకానికి రావాల్సి వస్తుంది. తర్వాత జరిగిన పరిణామాలేంటి అనేది క్లుప్తంగా కథ.. అయితే త్రిగర్తలకు, భూలోకానికి మధ్య జరిగిన టైం ట్రావెల్, బింబిసారుడు దాచిపెట్టిన అతిపెద్ద నిధి కోసం అన్వేషిస్తున్నవారికి బింబిసారుడు దొరికిపోవడం.. తిరిగి త్రిగర్తలకు ఆ తర్వాత మళ్లీ భూలోకానికి రావడం అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది.

నటీనటులు…
ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు.. బింబిసారుడిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఆ పాత్రకే తాను తప్ప ఎవరూ సూట్ అవరు అనేంతలా మెప్పించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీ ఇంతకముందు సినిమాలకంటే బెటర్‌గా అనిపించింది. త్రిగర్తల రాజ్యం నుండి భూలోకానికి వచ్చిన తర్వాత బింబిసారుడి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు.. ఆ సీన్స్‌లో తన నటనలో పరిణితి కనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లోనూ మెప్పించాడు. ఇంకో హైలెట్ ఏంటంటే బింబిసారుడు, దేవదత్తుడు అనే అన్నదమ్ముళ్ల పాత్రలు చేసాడు. ఇప్పటివరకు ఈ సీక్రెట్ ఎక్కడా రివీల్ చెయ్యలేదు మూవీ టీం. థియేటర్లో డ్యుయెల్ రోల్ అని తెలిసాక ఆడియన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు.

రాజకుమారి ఐరాగా కేథరిన్, వైజయంతిగా సంయుక్త మీనన్ ఉన్నంతలో బాగానే చేశారు. ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, సాయి కిరణ్ (నువ్వేకావాలి ఫేం), రాజీవ్ కనకాల, అయ్యప్పి పి.శర్మ, తనికెళ్ల భరణి పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆయా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా జుబేదా క్యారెక్టర్లో అలరించిన శ్రీనివాస రెడ్డి గురించి చెప్పుకోవాలి. ఉన్నంతలో కామెడీ బాగా వర్తౌట్ చేసాడు. కథలో ప్రాముఖ్యతగల పాత్రలో అలరించాడు.

టెక్నీషియన్స్…
ముందుగా డైరెక్టర్ వశిష్ట గురించి చెప్పాలి.. ఫస్ట్ సినిమాకే ఇంతటి భారీ కథను రాసుకోడం, హెవీ స్టార్ కాస్టింగ్‌తో తెరకెక్కించడం, కథలోని మలుపులు, త్రిగర్తలతో సహా పలు రాజ్యాలను ఇమేజిన్ చేసుకోవడం అనేది గ్రేట్ అనే చెప్పాలి. అనుకున్నది అనుకున్నట్లుగా.. ఇంకాస్త బెటర్‌గా తెరకెక్కించాడు. పార్ట్ 2లో ఆడియన్స్ కోసం మరికొన్ని సస్పెన్సెస్ దాచిపెట్టాడు.

ఛోటా కె నాయుడు విజువల్స్, కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి బ్యాక్ బోన్‌లా నిలిచాయి. కీరవాణి, చిరంతన్ భట్ కంపోజ్ చేసిన సాంగ్స్ బాగున్నాయి. కథలో భాగంగా పాటలు రావడం ప్లస్ అయ్యింది. వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ‘బింబిసార’ను రెండు పార్టులుగా అనుకున్నా కానీ ఎడిటింగ్ క్రిస్పీగా బాగుంది. వాసు దేవ్ మునెప్పగారి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ వర్క్ చాలా బాగుంది. కాస్ట్యూమ్స్, మేకప్, ఫైట్స్, కొరియోగ్రఫీ.. ఇలా ప్రతి డిపార్టెంట్, ప్రతి టెక్నీషియన్ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు.

ఓవరాల్‌గా…
గత రెండు నెలలుగా తెలుగు ఇండస్ట్రీలో గడ్డు పరిస్థితి నెలకొంది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ బరిలో బొక్కబోర్లా పడ్డాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లను నష్టాలపాలు చేసాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయింది. ఇప్పుడు అలాంటి లోట్లన్నిటినీ ‘బింబిసారుడు’ భర్తీ చేసాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...