Home Film News Samantha Treatment: వైద్యం కోసం అమెరికాకి ప‌య‌న‌మ‌వుతున్న స‌మంత‌.. ఖ‌ర్చు కోట్ల రూపాయ‌లా..!
Film News

Samantha Treatment: వైద్యం కోసం అమెరికాకి ప‌య‌న‌మ‌వుతున్న స‌మంత‌.. ఖ‌ర్చు కోట్ల రూపాయ‌లా..!

Samantha Treatment: టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత  కొన్నాళ్లుగా క‌ఠిన ప‌రీక్ష‌లు ఎదుర్కొంటుంది. నాగ చైతన్య‌తో విడాకుల త‌ర్వాత స‌మంత చాలా కుంగిపోయింది. ఆ త‌ర్వాత ఆమె మ‌యోసైటిస్ వ్యాధి బారిన ప‌డ‌డంతో స‌మంత  ప‌రిస్థితి దారుణంగా మారింది. కొన్నాళ్లపాటు మ‌యోసైటిస్ కోసం ప్ర‌త్యేక వైద్యం తీసుకున్న స‌మంత కాస్త కోలుకోవ‌డంతో తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్‌ని  పూర్తి చేసింది. రీసెంట్‌గా స‌మంత .. విజయ్‌ దేవరకొండకు జంటగా ఖుషి అనే సినిమాను చేయ‌గా, ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే పూర్తైంది. ఇక ఇప్పుడు  ఆమె సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే.. మ‌రి కొద్ది రోజుల‌లో ఇది కూడా పూర్తి కానుంది.

తాను ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ  పూర్తి చేసాక సమంత ఏడాది పాటు రెస్ట్ తీసుకోనుంద‌ట‌. తాను ఎలాంటి ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌ద‌ని ఆమె పీఆర్ తెలియ‌జేశారు. అయితే స‌మంత‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. వ‌చ్చే నెల‌లో స‌మంత అమెరికా వెళతారట. అక్కడ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకోనుంద‌ని,  ఈ ట్రీట్మెంట్ కోసం దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు కానుంద‌ని సమాచారం. ఈ ట్రీట్‌మెంట్ కోసమే స‌మంత  సినిమాల నుండి  విరామం తీసుకుంద‌ని అంటున్నారు. ఇక సమంత ఓ హాలీవుడ్ చిత్రానికి సైన్ చేసినట్లు ప్రచారం జ‌ర‌గ‌గా, ఇప్ప‌టి వ‌ర‌కు  దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక స‌మ‌యం న‌టించిన ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ మూవీ అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఇక స‌మంత గత ఏడాది అక్టోబర్ నెలలో తాను  మయోసైటిస్ బారిన ప‌డిన విష‌యం తెలిపి అంద‌రికి పెద్ద షాక్ ఇచ్చింది.. అయితే ఈ వ్యాధి ప్రాణాంతక వ్యాధి కాదు, అలా అని  చిన్న సమస్య కూడా కాదు.దీంతో నేను  పోరాడాల్సి ఉందని సమంత త‌న సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు. ఈ ప్రకటన తర్వాత సమంత చాలా రోజుల పాటు ఇంటికే ప‌రిమితం అయింది. గుణ‌శేఖ‌ర్ తెరకెక్కించిన శాకుంత‌లం సినిమా ప్ర‌మోష‌న్స్ కోస‌మే బ‌య‌ట క‌నిపించింది. త‌న‌కు వ‌చ్చిన వ్యాధి వ‌ల‌న స‌మంతకి నీర‌సం ఎక్కువైంద‌ట‌.  కళ్ళు కాంతిని చూడలేకపోతున్నాయని , అందు కోసం తాను గ్లాసెస్ ధ‌రించిన‌ట్టు స‌మంత చెప్పుకొచ్చింది

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...