Home Film News Chiranjeevi: ఇదేంటి చిరంజీవి కొత్త సినిమాలో ఒక్క పాట‌, ఫైట్ కూడా ఉండ‌దా.. ఫ్యాన్స్ మెచ్చుతారా..!
Film News

Chiranjeevi: ఇదేంటి చిరంజీవి కొత్త సినిమాలో ఒక్క పాట‌, ఫైట్ కూడా ఉండ‌దా.. ఫ్యాన్స్ మెచ్చుతారా..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఆరు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చిన కూడా చాలా ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. హిట్, ఫ్లాప్స్ ప‌క్క‌న పెడితే వ‌రుస సినిమాలు చేస్తూ మంచి స్పీడ్‌తో దూసుకుపోతున్నారు. చివ‌రిగా వాల్తేరు వీర‌య్య అనే సినిమాతో మంచి హిట్ కొట్టిన చిరు ఇప్పుడు భోళా అనే సినిమాతో ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌నున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజ‌ర్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ప్రేక్ష‌కుల‌కి మంచి కిక్ ఇచ్చింది. టీజ‌ర్ రిలీజ్ తర్వాత సినిమాని చూడాల‌నే ఆతృత అభిమానుల‌లో చాలా పెరిగింది. ఇక ఈ సినిమా త‌ర్వాత మెగాస్టార్ ప‌లు సినిమాల‌కి  ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తుండ‌గా, ఒక సినిమాకి సంబంధించిన వార్త ఫ్యాన్స్ షాక్ అయ్యేలా చేస్తుంది.

భోళా శంకర్ మూవీ పూర్తైన త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ తో ఒక సినిమా ,  బింబిసార ద‌ర్శ‌కుడు వసిష్ఠ తో ఒక సినిమా  చేయ‌నున్నాడు. ఈ రెండింట్లో  ముందుగా కళ్యాణ్ కృష్ణ సినిమా ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది. ఇందులో  డీజే టిల్లుతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్న‌ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ముఖ్య పాత్ర‌లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక  వార్త ఇప్పుడు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. క‌ళ్యాణ్ కృష్ణ తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో విల‌న్ ఉండ‌డ‌ట‌, ఫైట్స్ అనేవి క‌నిపించ‌వ‌ట‌, అలానే పాట‌ల‌కు కూడా ఉండ‌వ‌ని తెలుస్తుంది.

ఇక ీ చిత్రాన్ని  పూర్తి స్థాయి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ. చిరంజీవి సినిమా అంటే ఆయ‌న డ్యాన్స్ కోసం ఫైట్స్ కోసం అభిమానులు చాలా ఆస‌క్తి చూపుతుంటారు. మ‌రి ఈ రెండు లేకుండా  చిరంజీవి సినిమాని మనం ఊహించుకోలేము. మరి ఇదే నిజ‌మైతే ఫ్యాన్స్ దీనిని ఎలా తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇక ఈ చిత్రం లో చిరంజీవి కి జోడిగా త్రిష మరియు సిద్దు కి జోడిగా శ్రీలీల నటించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.. సెప్టెంబర్ నుండి  చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి త్వ‌ర‌లోనే ఓ క్లారిటీ అయితే రానుంది.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...