Home Film News Tamannaah: విజ‌య్ క‌న్నా ముందు త‌మ‌న్నా.. విరాట్ కోహ్లీ ప్రేమ‌లో మునిగి తేలిందా?
Film News

Tamannaah: విజ‌య్ క‌న్నా ముందు త‌మ‌న్నా.. విరాట్ కోహ్లీ ప్రేమ‌లో మునిగి తేలిందా?

Tamannaah: మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పేరు ఇటీవ‌ల ఎక్కువ‌గా వినిపిస్తుంది. అందుకు కారణం ఆమె త‌న రిలేష‌న్ షిప్‌పై ఓపెన్ కావ‌డ‌మే. గ‌తంలో త‌మన్నాకి ప‌లువురితో ఎఫైర్ ఉన్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే అవ‌న్నీ అవాస్త‌వాలు అంటూ కొట్టి ప‌డేసింది. ఇక కొద్ది నెల‌లుగా బాలీవుడ్ న‌టుడు విజ‌య్ తో డేటింగ్ చేస్తున్న‌ట్టు ప్రచారం జ‌రిగింది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన త‌మ‌న్నా ఆ ప్ర‌చారాలు నిజ‌మేన‌ని పేర్కొంది.దీంతో త‌మన్నా పేరు ఒక్క‌సారిగా  మారుమ్రోగిపోవ‌డ‌మే కాకుండా ఆమె గత రిలేష‌న్స్ గురించి ముచ్చ‌టిస్తున్నారు. ఇప్పుడు తమన్నా వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంది. ఇటీవలే ఆమె నటించిన జీ కర్దా  వెబ్ సిరీస్ విడుదల‌కాగా, నెలాఖ‌రున‌ లస్ట్ స్టోరీ 2 రిలీజ్ కానుంది. ఇందులో త‌న అందాల‌తో రెచ్చిపోయింది.
ఇక త‌మ‌న్నా ప్రేమ వ్యవహారం గురించి చ‌ర్చిస్తే ఈ అమ్మ‌డు  గతంలో విరాట్ కోహ్లీ తో డేటింగ్ చేసిందంటూ ప్ర‌చారాలు సాగాయి.. ఒక‌ ప్రకటన షూటింగ్‌లో విరాట్‌ కోహ్లీ, తమన్నా క‌లిసారు. అప్పటి నుండి రిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. కొన్నేళ్లుగా ఈ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా,  తమన్నా భాటియా ఒక ఇంటర్వ్యూలో తనకు, కోహ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘యాడ్ ఫిల్మ్ సమయంలో మేం కలిసాం.  ఆ తర్వాత  ఎప్పుడు  విరాట్ కోహ్లీని కలవలేదు. విరాట్ కోహ్లీతో కలిసి పనిచేయడం.. చాలా మంది నటుల కంటే మెరుగ్గా ఉంది అని ఓ సంద‌ర్భంలో త‌మ‌న్నా చెప్పుకొచ్చింది.
తమన్నా భాటియా గతంలో విరాట్ కోహ్లీ విష‌యంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం ఆమె విజయ్ వర్మ తో ప్రేమలో ఉండటమే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అంతేకాదు అప్పటి విషయాన్ని కొందరు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు.ఇక  విజయ్ తో కలిసి ఉంటే త‌న‌కు ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది తమన్నా. మరోవైపు అనుష్క శర్మతో వివాహానికి ముందు, విరాట్ కోహ్లీ చాలా మందితో ఎఫైర్స్ కొన‌సాగించాడంటూ ప్ర‌చారాలు సాగాయి.  కానీ చివరకు మాత్కం అనుష్క శర్మను విరాట్ కోహ్లీ 11 డిసెంబర్ 2017న ఇటలీలో వివాహం చేసుకొని ఆ త‌ర్వాత ఓ చిన్నారికి జ‌న్మ‌నిచ్చారు.

Related Articles

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...

Samantha: స‌మంత మేనేజ‌ర్ మోసం.. అడ్డంగా బుక్ అయ్యాడుగా…!

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న క్యూట్‌నెస్ తో పాటు...