Home Film News Chiranjeevi Events: చిరంజీవి ఈవెంట్స్‌కి డుమ్మా కొడుతున్న హీరోయిన్స్.. కార‌ణం ఏంటో తెలుసా?
Film News

Chiranjeevi Events: చిరంజీవి ఈవెంట్స్‌కి డుమ్మా కొడుతున్న హీరోయిన్స్.. కార‌ణం ఏంటో తెలుసా?

Chiranjeevi Events: టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల‌లో చిరంజీవి ఏడు ప‌దుల వ‌య‌స్సుకి ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. అయిన‌ప్ప‌టికీ ఎంతో ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి న‌టించిన చాలా సినిమాలు అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ని తిర‌గ‌రాసాయి. ఇక ఖైదీ నెం 150 చిత్రంతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చిన చిరు ఇప్ప‌డు త‌న జోరుని కొన‌సాగిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో భోళా శంక‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించనున్నారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ‌త రాత్రి గ్రాండ్ గా జ‌ర‌గ‌గా, ఈ ఈవెంట్‌కి చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించిన త‌మ‌న్నా డుమ్మా కొట్టింది. దీంతో చిరు సినిమాల‌కే హీరోయిన్స్ ఎందుకు డుమ్మా కొడుతున్నారన్న విష‌యం హాట్ టాపిక్‌గా మారింది.

చిరు న‌టించిన   సైరా చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, ఆమె  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు  రాలేదు. సాధార‌ణంగా న‌య‌న‌తార ఎవ‌రి సినిమా అయినా సరే ప్రమోషన్లకు పెద్ద‌గా రాదు.  దాంతో ఈ విష‌యాన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోలేదు. ఇక ఆ త‌ర్వాత చిరంజీవి న‌టించిన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కాజ‌ల్ కూడా డుమ్మా కొట్టింది.అయితే ఫైన‌ల్ ఔట్‌పుట్‌లో కాజ‌ల్‌ని లేపేసారు కాబ‌ట్టి , చిత్రంలో ఆమె క‌థానాయిక‌క‌పోవ‌డంతో ఈవెంట్‌కి రాలేద‌ని అంద‌రు అనుకున్నారు.  ఇక వాల్తేరు వీర‌య్య ప్రీరిలీజ్ ఈవెంట్‌కి శృతి హాసన్ డుమ్మా కొట్టింది. ఆ స‌మ‌యంలో చిరు.. శృతిపై సెటైర్స్ వేశారు. ఈ ఈవెంట్ ముందు రోజు జ‌రిగిన వీర‌సింహారెడ్డిలో మెరిసిన శృతి వాల్తేరు వీర‌య్య‌కి మాత్రం రాలేదు.

ఇక రీసెంట్ గా జ‌రిగిన  భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిత్ర క‌థానాయిక‌ తమన్నా డుమ్మా కొట్టేసింది. చిత్రంలో చిరంజీవికి చెల్లిగా న‌టించిన కీర్తి సురేష్ రాగా, త‌మ‌న్నా హాజ‌రు కాక‌పోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొద్ది రోజుల ముందు చిరంజీవితో ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న తమ‌న్నా స‌డెన్‌గా అంత పెద్ద ఈవెంట్‌కి డుమ్మా కొట్ట‌డం వెన‌క కార‌ణం ఏంట‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.ఏదేమైన గత కొద్ద రోజులుగా హీరోయిన్స్ ఇలా చిరంజీవి సినిమాల‌కి డుమ్మా కొట్ట‌డం ప్ర‌తి ఒక్కరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...