Home Film News Ileana: మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇలియానా.. పేరు పెట్ట‌డ‌మే కాదు ఫేస్ కూడా చూపించేసింది..!
Film News

Ileana: మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ఇలియానా.. పేరు పెట్ట‌డ‌మే కాదు ఫేస్ కూడా చూపించేసింది..!

Ileana: గోవా బ్యూటి ఇలియానా కొద్ది రోజులుగా త‌న ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఫొటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి థ్రిల్ అందించింది. ఇలియానా త‌న ప్రియుడు పేరు వివ‌రాలు చెప్ప‌కుండా దోబూచులాడుతూ వ‌చ్చింది. ఇక తాజాగా త‌ను పండంటి కొడుక్కి జ‌న్మ‌నిచ్చిన‌ట్టు సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఆగ‌స్ట్ 1వ తేదిన త‌నకు బిడ్డ పుట్టిన పేర్కొన్న ఇలియానా శ‌నివారం సాయంత్రం ఈ విష‌యాన్ని త‌న ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేసింది. అంతేకాదు ఆ బుడ్డోడి ఫేస్ రివీల్ చేస్తూ.. అత‌డినికి   కోవా ఫీనిక్స్ డోలాన్‌ అని పేరు పెట్టినట్టు ఇలియానా తెలిపింది. ఇక  ఓ ఎమోషనల్ నోట్ కూడా పోస్టు చేసింది.

ఈ ప్రపంచంలోకి మా బేబీ బాయ్‌ను ఆహ్వానించినందుకు మేము  ఎంత సంతోషంగా ఉన్నామో పదాల్లో చెప్పలేం. మా మనసులు ఆనందంతో నిండిపోయాయి అంటూ తన పోస్ట్‌లోరాసుకొచ్చింది. అయితే భ‌ర్త ఎవ‌ర‌నేది చెప్ప‌కుండా ఇలియానా ఇప్ప‌టికీ స‌స్పెన్స్ లో పెట్ట‌డం ఏ మాత్రం బాగోలేద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు ఆమెకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.   అథియా శెట్టి, నర్గిస్ ఫక్రీ, సోఫీ చౌదరి సహా పలువురు నటీమణులు సోష‌ల్ మీడియా ద్వారా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేశారు.  ప్ర‌స్తుతం ఇలియానా త‌న‌యుడి పిక్ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

అయితే  ఈ మ‌ధ్య  కాలంలో సెల‌బ్రిటీలు అనుష్క శర్మ, అలియా భట్, ప్రియాంక చోప్రా జోన్స్ వంటివారు  తమ పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో కనిపించకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. పూర్తిగా ఫేస్ కావ‌ర్ చేయ‌డ‌మో లేదంటే బ్ల‌ర్ చేయ‌డమో చేసేవారు. కాని ఇలియానా మాత్రం చాల డేరింగ్‌గా త‌న బిడ్డ ముఖాన్ని ప్ర‌పంచానికి చూపించి ఆనందం వ్య‌క్తం చేసింది. ఇలియానా గ‌ట్స్ కి కొంద‌రు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇక ఇలియానా కెరీర్ విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపిన ఇలియానా ప్ర‌స్తుతం పెద్ద‌గా ఆఫ‌ర్స్ అందుకోలేకపోతుంది. తెలుగులో అవ‌కాశాలు లేవు. హిందీలో అప్పుడప్పుడు చిన్నా చిత‌కా పాత్ర‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇలియానా బిడ్డ‌కు జ‌న్మనిచ్చి ఫ్యామిలీతో సంతోషంగా జీవించాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...