Home Film News Sujitha: అదే వారు చేసిన తెలివి త‌క్కువ ప‌ని..అన్న‌య్య‌తో క‌ళ్యాణి విడిపోవ‌డానికి కార‌ణ‌మిదే…!
Film News

Sujitha: అదే వారు చేసిన తెలివి త‌క్కువ ప‌ని..అన్న‌య్య‌తో క‌ళ్యాణి విడిపోవ‌డానికి కార‌ణ‌మిదే…!

Sujitha: ఈ మ‌ధ్య కాలంలో సెల‌బ్రిటీల విడాకుల గురించి ఎక్కువ‌గా వార్త‌లు వ‌స్తున్నాయి. ఎంతో అన్యోన్యంగా క‌లిసి ఉన్నజంట‌లు కూడా చిన్న చిన్న కార‌ణాల‌తో డైవ‌ర్స్ తీసుకుంటున్నారు. అయితే ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన క‌ళ్యాణి .. స‌త్యం లాంటి సూప‌ర్ హిట్ మూవీ తెర‌కెక్కించిన సూర్య‌కిర‌ణ్‌ని వివాహం చేసుకుంది. కొన్నాళ్లు వీరిద్ద‌రు బాగానే ఉన్నా కూడా కొన్ని కార‌ణాల వ‌ల‌న విడిపోయారు. అయితే సూర్య కిర‌ణ్ బిగ్ బాస్ తెలుగు సీజ‌న్‌లో పాల్గొన‌గా, ఆయ‌న తన భార్య‌తో విడిపోవ‌డంపై స్పందిస్తూ చాలా బాధ‌ప‌డ‌డ్డాడు. ఇక తాజాగా న‌టి, సూర్య కిర‌ణ్ సోద‌రి వారి విడాకుల విష‌యంపై స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం చిత్రంలో అత్యంత కీలకమైన మూగ అబ్బాయి పాత్రలో నటించిన సుజిత ఇప్పుడు సినిమాల్లో, టివి సీరియల్స్ లో రాణిస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా తన అన్న సూర్య కిర‌ణ్‌, వదిన క‌ళ్యాణిల‌ మధ్య ఏం జరిగింది, వారు ఎందుకు విడిపోవ‌ల్సి వ‌చ్చింది అనే విషయాన్ని సుజిత రివీల్ చేసింది. నేను క‌ళ్యాణితో సొంత చెల్లి మాదిరిగా ఉండేదాన్ని.అయితే ఆర్ధిక స‌మ‌స్య‌లు ఎవ‌రికైన వ‌స్తాయి. వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాలి. అయితే అన్న‌,వదిన‌లు పెద్ద పెద్ద విష‌యాల‌లో ఇన్వాల్వ్ అయ్యారు. అన్న‌య్య‌కి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. అయితే నాతో ఒక సినిమా నిర్మిస్తున్నాన అని చెప్పిన‌ప్పుడు స‌రే అన్నాను

 

ఆ సినిమా వ‌ల‌న వారు ఆర్ధికంగా న‌ష్ట‌పోయారు. సాయం చేయాల‌నుకున్న స‌మ‌యంలో ఇద్ద‌రు స్ట్రాంగ్ డెసిష‌న్ తీసుకొని విడిపోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఆర్ధిక స‌మ‌స్య‌ల‌తోనే వారిద్ద‌రు విడిపోయారు. అన్న‌య్య‌కి మంచి ప్రాప‌ర్టీ ఉంది. కాని అప్పుల వ‌ల‌న దానిని కూడా అమ్మేశారు. ఈ విష‌యం నాకు చాలా లేట్‌గా తెలిసింది. సినిమా అనేది ఒక‌ర‌క‌మైన గ్యాంబ్లింగ్‌.అందులో మొత్తం పెట్టేసి తెలివి త‌క్కువ పని చేశారు. వారు విడిపోవ‌డానికి ఆర్ధిక స‌మ‌స్య‌లే ముఖ్య కార‌ణ‌మ‌ని సుజిత చెప్పుకొచ్చింది. వాళ్లిద్దరూ విడిపోతున్నట్లు కూడా నాకు ఒక్క విష‌యం కూడా చెప్పలేదు. వారిద్దరికీ అదే కరెక్ట్ అనిపించినప్పుడు మనం ఏమీ చేయలేము క‌దా అని సుజిత చెప్పుకొచ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...