Home Film News Krithi Sanon: కృతిస‌న‌న్ తీరుని త‌ప్పుబ‌ట్టిన రామాయ‌ణం సీత‌.. ప్ర‌జ‌ల సెంటిమెంట్స్‌తో ఆడుకోవద్దంటూ చుర‌క‌
Film News

Krithi Sanon: కృతిస‌న‌న్ తీరుని త‌ప్పుబ‌ట్టిన రామాయ‌ణం సీత‌.. ప్ర‌జ‌ల సెంటిమెంట్స్‌తో ఆడుకోవద్దంటూ చుర‌క‌

Krithi Sanon: బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా ఆదిపురుష్ అనే చిత్రం తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. ప్ర‌భాస్, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన ఈ చిత్రం జూన్ 12న విడుద‌ల కానుంది. ఇటీవ‌ల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుప‌తిలో చాలా ఘనంగా జ‌రిగింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఆ సినిమాలో సీత పాత్ర పోషించిన హీరోయిన్ కృతి సనన్,చిత్ర‌ దర్శకుడు ఓం రావత్ కలియగ వైకుంఠ క్షేత్రంలోని శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. అయితే దర్శనం తర్వాత బయటకు వచ్చిన కృతి, ఓం రౌత్‌ మాడవీధుల్లో కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొన్నారు. ఇది చాలా నీచనీయమైన సంస్కృతి అని ప్ర‌తి ఒక్క‌రు మండిప‌డుతున్నారు. శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి శ్రీ సీఎస్ రంగరాజన్ కూడా దీనిపై ఘాటుగానే స్పందించారు

దేవుడి సినిమాలో నటించి.. పుణ్య క్షేత్రంలో అశ్లీలంగా ప్రవర్తించటంపై రామాయ‌ణంలో సీత పాత్ర పోషించిన దీపిక కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మీడియాతో మాట్లాడిన దీపిక‌.. ఇప్పుడున్న నటులతో ఇదే స‌మ‌స్య‌. ఎవ్వరూ కూడా తమ పాత్రలోకి వెళ్లరు.. దాని ఎమోషన్‌ను కూడా అర్థంచేసుకోరు. కృతిసనన్‌, ఓం రౌవత్‌కు ఆదిపురుష్  అనేది ఒక సినిమా మాత్ర‌మే అయి ఉండొచ్చు. సీత పాత్రలో మనసు పెట్టి నటించడానికి కృతి స‌న‌న్ చాలా కష్టపడి ఉండొచ్చు. అయితే ఈ కాలంలో ఎవరినైనా హత్తుకోవటం, ముద్దు పెట్టుకోవటం అనేది మంచిగా పలకరించటంలా మారింది. తిరుమ‌ల వంటి  పవిత్ర క్షేత్రంలో అలా చేయటం మాత్రం చాలా సిగ్గుచేటు.

కృతి ఆదిపురుష్ చిత్రంలో సీత‌గా న‌టించిన కూడా  తాను సీత అని ఎప్పుడూ అనుకోదు. మా కాలంలో అయితే  షూటింగ్‌ స్పాటులోఉన్న ఎవ‌రు  కూడా మమ్మల్ని మా పేర్లతో పిలవటానికి ఏ మాత్రం సాహసం చేసేవారు కాదు. మేము దేవుళ్ల పాత్రలు పోషించినప్పుడు  సెట్‌లోని చాలా మంది వచ్చి మా పాదాలు కూడా తాకి వెళ్లేవారు. ఆ కాలంలో ప్రేక్షకులు కూడా మమ్మల్ని నిజమైన దేవుళ్లుగానే భావించారు. మేము ఎవ్వరినీ హత్తుకోలేదు, అలానే ఇలా ముద్దు కూడా పెట్టనిచ్చేవాళ్లం  కాదు. ఆదిపురుష్‌లో చేసిన వారికి అది కేవలం సినిమాగానే ఉన్న‌ప్ప‌టికీ,  ప్రజల సెంటిమెంట్లను గాయపర్చకుండా ఉండ‌డం మంచిది అని దీపిక ఆగ్రహం వ్య‌క్తం చేసింది..

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...