Home Film News Venu Swamy: రామ్ చ‌ర‌ణ్ కూతురిది ఇంత మంచి జాత‌క‌మా.. తండ్రితో పాటు తాత‌కి మంచి రోజులు..!
Film News

Venu Swamy: రామ్ చ‌ర‌ణ్ కూతురిది ఇంత మంచి జాత‌క‌మా.. తండ్రితో పాటు తాత‌కి మంచి రోజులు..!

Venu Swamy: గ‌త కొద్ది రోజులుగా మెగా అభిమానులు  రామ్ చ‌ర‌ణ్‌కి పుట్ట‌బోయేది కూతురా, కొడుకా అంటూ జోరుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే జూన్ 20 తెల్లవారుఝామున ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డకు జ‌న్మ‌నిచ్చింది. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరిసింది. త‌మ ఇంటికి మ‌హాల‌క్ష్మీ వ‌చ్చింద‌ని మెగా ఫ్యామిలీ కుటుంబ స‌భ్యులు సంబ‌ర‌ప‌డ్డారు. ఉపాస‌న బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన వెంట‌నే అపోలో ఆసుప‌త్రికి చిరంజీవి కుటుంబ స‌భ్యుల‌తో పాటు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి, నిహారిక‌, వ‌రుణ్ తేజ్ , సాయిధ‌ర‌మ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్ వెళ్లారు. చిన్నారిని ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. అయితే రామ్ చ‌ర‌ణ్ కూతురు పుట్టిందో లేదో ఆ చిన్నారికి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి తాజాగా రామ్ చ‌ర‌ణ్ కూతురు జాత‌కం గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  రామ్ చరణ్ కూతురిది పునర్వసు నక్షత్రము, రెండవ పాదం, మిధున రాశి. జన్మనామము కోణంగి అని వేణు స్వామి తెలిపారు. చిన్నారి పేరెంట్స్  రామ్ చరణ్ ది రోహిణి నక్షత్రం, ఉపాసనది కృత్తిక నక్షత్రం, వారి పాపది పునర్వసు నక్షత్రం  కాగా,  ముగ్గురు కూడా దైవిక అంశ కలిగిన నక్షత్రాల్లో జన్మించారని చెప్పుకొచ్చారు. ఇక ఆ పాప జన్మించిన సమయం అద్భుతంగా ఉందని, జాతకంలో విపరీతమైన రాజయోగం ఉన్నట్లు వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆమె భవిష్యత్తులో గొప్ప స్థాయిలో కీర్తి గడిస్తుందని కూడా చెప్పారు.

రామ్ చ‌ర‌ణ్ కూతురు కొణిదెల వంశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువస్తుందని వెల్లడించారు. చిన్నారి వ‌ల‌న  తాతకు తండ్రికి అన్ని రంగాల్లో కలిసి వస్తుందని చెప్పారు. తాతను, తండ్రిని మించి గొప్ప స్థాయికి కూడా చేరే అవ‌కాశం ఉంద‌ని కూడా  వేణు స్వామి అన్నారు. అయితే ఎప్పుడు సెల‌బ్రిటీల గురించి నెగెటివ్‌గా జాత‌కాలు చెప్పే వేణు స్వామి తొలిసారి  రామ్ చరణ్ కూతురి జాతకం గురించి ఇంత పాజిటివ్‌గా స్పందించ‌డంపై అంద‌రు షాక్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఉపాస‌న ఇప్ప‌టికీ అపోలోలోనే ఉన్న‌ట్టు  తెలుస్తుండ‌గా, ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉంది.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...