Home Film News Adipurush: అనాథ పిల్ల‌ల‌కు ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా చూపించిన క‌లెక్ట‌ర్
Film News

Adipurush: అనాథ పిల్ల‌ల‌కు ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా చూపించిన క‌లెక్ట‌ర్

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా,  అందాల భామ కృతి సనన్ సీతగా.. స‌న్నీ సింగ్‌ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా దర్శ‌కుడు ఓం రౌత్ తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆదిపురుష్. ఎన్నో అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రానికి అంత‌టా మిక్స్‌డ్ టాక్ వ‌చ్చింది. మొద‌టి మూడు రోజులు క‌లెక్ష‌న్స్ భారీగానే రాబ‌ట్టిన ఈ చిత్రం త‌ర్వాతి రోజు నుండి డీలా ప‌డింది. ఇక ఈ సినిమాపై ఇప్పుడు నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆదిపురుష్ లోని రాముడు, రావణుడి పాత్రల్ని వీడియో గేమ్ గా చిత్రీకరించారని  ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్  ఆరోపించింది. ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న  ప్రతి భారతీయుడిని బాధ పెట్టే విధంగా   ఉందని, తక్షణం ఈ సినిమాని ఆపేయాలంటూ మోడీకి లేఖ కూడా రాసారు.

చిత్ర దర్శకుడు ఓం రౌత్, రచయిత మనోజ్ ముంతాషిర్ పై  ఎఫ్ఐఆర్ నమోదుచేయాలని చెప్పిన‌ ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్, భవిష్యత్తులో ఈ సినిమా ఓటీటీలోకి కూడా రాకుండా చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరింది. అయితే ఒక‌వైపు ఈ చిత్రం ఇంత విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకుంటుండ‌గా, జిల్లా క‌లెక్ట‌ర్ చేసిన ప‌ని ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  పల్నాడు జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌ నరసరావు పేటలోని అనాథ పిల్లలు, సోషల్‌ వెల్ఫేర్‌ విద్యార్థినీ, విద్యార్థులకు ఈ సినిమాని చూపించ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దాదాపు ఐదు వందల మంది విద్యార్థులకు విజేత థియేటర్ లో ఈ సినిమాని త్రీడీ ఫార్మాట్‌లోఆయ‌న చూపించారు. విద్యార్ధుల‌తో పాటు కలెక్టర్‌ సినిమాని వీక్షించడం  మరో విశేషం. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ సినిమాపై ఇంత దారుణ‌మైన విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో ప్ర‌భాస్ అభిమానులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సినిమాతో ప్ర‌భాస్ బాక్సాఫీస్ రారాజుగా మార‌తాడ‌ని అనుకోగా, వారి ఆశ‌లు అన్ని అడియాశ‌లు అయ్యాయ‌ని చెప్పాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...