Home Film News Bigg Boss: మ‌రికొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న బిగ్ బాస్.. ఈ సీజ‌న్ కంటెస్టెంట్స్ వీరే..!
Film News

Bigg Boss: మ‌రికొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న బిగ్ బాస్.. ఈ సీజ‌న్ కంటెస్టెంట్స్ వీరే..!

Bigg Boss: బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం మ‌న దేశంలో మొదట హిందీలో మొద‌లై ఆ త‌ర్వాత ప‌లు భాష‌ల‌కి పాకింది. తెలుగులో ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆరు సీజ‌న్స్ తో పాటు ఒక ఓటీటీ షో జ‌రుపుకుంది. ఇక త్వ‌ర‌లో బిగ్ బాస్ 7 మొద‌లు కానుండ‌గా, దీనికి సంబంధించి అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ షోకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయ‌ని, కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ కూడా పూర్తైంద‌ని అంటున్నారు. అయితే ఆర‌వ సీజ‌న్  ప్లాప్ కావ‌డంతో తాజా సీజన్ పై ప్రత్యేక దృష్టి పెట్టిన‌ట్టు తెలుస్తుంది.

సీజ‌న్7 తో ఎలాగైన స‌క్సెస్ అందుకోవాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారు. దీని కోసం అనేక ర‌కాల ప్లాన్స్ అమ‌లు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌజ్‌లోకి  కొత్త వ్యక్తులను  తీసుకురావడంతో పాటు సరికొత్త  టాస్కుల‌తో అలరించాలని ప్లాన్స్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలోనే బిగ్ బాస్ 7 కాస్త ఆల‌స్యంగా ప్రారంభం కానుంద‌ని అంటున్నారు. ఈ సారి మాత్రం  బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలను.. ఎక్కువ పారితోషికం ఇచ్చి మ‌రీ తీసుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది. కాంట్ర‌వర్సీల‌లో ఇరుక్కున్న వారిని, విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలను, కొత్త‌గా పెళ్లైన జంట‌ల‌ని తాజా సీజ‌న్‌కి  ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

ఈ సీజ‌న్ లిస్ట్‌కి సంబంధించి కొంద‌రు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.  తేజస్విని, మహేష్ బాబు కాళిదాసు, సిద్దార్థ్ వర్మ‌తో పాటు   సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, ఆయన భార్య తేజస్విని ఉన్నార‌ని స‌మాచారం. యాంకర్స్ దీపికా పిల్లి, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ ఈ జాబితాలో ఉన్నట్లు టాక్. మంగ్లీ, హేమచంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి , సింగర్ నోయల్, ఆయన మాజీ భార్య ఎస్తేర్ నోరోన్హా కూడా బిగ్ బాస్  హౌజ్ లోకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్రా శర్మ కూడా హౌజ్ లోకి ప్రవేశించనున్నారని తెలుస్తోంది. త్వ‌ర‌లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుంది.

Related Articles

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...

చిరు విశ్వంభ‌ర‌లో మెగా అభిమానులను ఎగ్జైట్ చేస్తున్న క్రేజీ న్యూస్..!

పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోల్లో హిట్, ప్లాఫ్ లతో సంబంధం...