Home Film News Adipurush: ప‌డిపోతున్న ఆదిపురుష్ క‌లెక్ష‌న్స్ గ్రాఫ్‌.. నాలుగో రోజు మ‌రింత దారుణం..!
Film News

Adipurush: ప‌డిపోతున్న ఆదిపురుష్ క‌లెక్ష‌న్స్ గ్రాఫ్‌.. నాలుగో రోజు మ‌రింత దారుణం..!

Adipurush: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, అందాల భామ కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓం రౌత్ తెర‌కెక్కించిన చిత్రం ఆదిపురుష్‌. భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రాన్ని వ‌రుస వివాదాలు చుట్టు ముడుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు ఓం రౌత్ తిరుమ‌ల మాడ వీధుల్లో కృతి స‌న‌న్‌కి కిస్ ఇవ్వ‌డంతో అక్క‌డి నుండి ఈ మూవీకి వివాదాలు స్టార్ట్ అయ్యాయి. సినిమా రిలీజ్ అయిత‌న త‌ర్వాత చిత్రంలో రాముడు, సీతాదేవి, హనుమంతుడు, రాక్షస రాజు రావణుడు మరియు ఇతిహాసమైన రామాయణంలోని అనేక కీలకమైన అంశాలను చిత్రీకరించిన తీరుపై హిందూ సంఘాలు మండిప‌డుతున్నాయి. రాముని భక్తులు అయితే చిత్ర యూనిట్‌పై గుర్ర‌గా ఉన్నారు.

ఉత్తర భారతదేశంలోని  ప‌లు ప్రాంతాల‌లో అయితే  సినిమాకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి . కొంద‌రు అయితే ఆదిపురుష్ సినిమాని తక్షణమే దేశవ్యాప్తంగా నిషేధించాలంటూ డిమాండ్ కూడా చేస్తున్నారు. నిరసనకారులు అయితే  థియేటర్లపై దాడి చేసి ఆదిపురుష్ చిత్ర  ప్రదర్శనను అడ్డుకున్నారు. పవిత్ర ఇతిహాసమైన రామాయణాన్ని ఇలా వక్రీకరించి, కించపరిచినందుకు ఆదిపురుష్ నిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.  అయితే వ‌చ్చే వారం నుండి సినిమా ప‌లు మార్పుల‌తో థియేట‌ర్స్ లో ప్ర‌ద‌ర్శితం కానుంద‌ని చెప్పిన కూడా వారు విన‌డం లేదు.

జూన్ 16న విడుద‌లైన ఆదిపురుష్‌కి మిక్స్ డ్ టాక్ వ‌చ్చిన కూడా  మొదటి రోజు ఈ చిత్రం  ప్రపంచ వ్యాప్తంగా 130 కోట్లకు పైగా  వసూళ్లను రాబట్టింది. రెండవ రోజు శనివారం 100 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబ‌ట్టింది. ఇక, మూడవ రోజు ఆదివారం కావటంతో ఈ సినిమాకి  వసూళ్లు బాగానే వ‌చ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం  110 కోట్ల రూపాయల వసూళ్లు రాబ‌ట్టింది. ఇక నాలుగో రోజు మాత్రం వసూళ్లు డీలా ప‌డ్డాయి. ఆదిపురుష్ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు 14 కోట్లు రాబ‌ట్ట‌గా.. హిందీ బెల్ట్‌లో 11 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్ల రూపాయల గ్రాస్‌ వచ్చింది.  అంటే గ‌త మూడు రోజుల కలెక్షన్లతో పోల్చుకుంటే నాలుగవ రోజు కలెక్షన్లకి బాగానే గండిప‌డింది..

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...