Home Film News Chiranjeevi Family: కూతురికి జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌న‌.. చిరంజీవి ఫ్యామిలీ గురించి అంద‌రిలో ఇదే చ‌ర్చ‌
Film News

Chiranjeevi Family: కూతురికి జ‌న్మ‌నిచ్చిన ఉపాస‌న‌.. చిరంజీవి ఫ్యామిలీ గురించి అంద‌రిలో ఇదే చ‌ర్చ‌

Chiranjeevi Family: మెగా అభిమానులు కొన్నాళ్లుగా ఈ రోజు కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. రామ్ చ‌రణ్‌- ఉపాస‌న‌లు పెళ్లి చేసుకొని 11ఏళ్లు అవుతున్నా కూడా ఇప్ప‌టికీ పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌క‌పోవ‌డంతో అభిమానులు, మీడియా సంస్థ‌లు వారిని ప‌దే ప‌దే ప్ర‌శ్నించారు. ఎట్ట‌కేల‌కు జూన్ 20 ఉద‌యం ఉపాస‌న పండంటి పాప‌కి జ‌న్మ‌నిచ్చింది.  హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో ఉపాసనకి డెలివ‌రీ అయింది. త‌ల్లితో పాటు పుట్టిన పాపాయి ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మెగా ఇంట శుభవార్త బ‌య‌ట‌కు రావ‌డంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఇక  మెగా ప్రిన్సెస్ పేరిట పూజలు, అర్చనలు చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామినాయుడు పిలుపునిచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి కుటుం

బంలోకి మరో కొత్త వ్యక్తి రావడంతో ఇప్పుడు  వారి ఆనందం అంతా ఇంతా కాదు. త‌మ  ఇంటికి మరో ధనలక్ష్మీ వచ్చిందని భావిస్తున్నారు. అయితే రామ్ చ‌ర‌ణ్‌కి కూడా కూతురు పుట్ట‌డంతో ఇప్పుడు నెట్టింట కొత్త చ‌ర్చ న‌డుస్తుంది. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో పాటు చిన్న కుమార్తె శ్రీజకు కూడా ఇద్దరేసి కుమార్తెలున్నారు. అంటే ఇప్ప‌టికే  చిరుకు నలుగురు మనవరాళ్లు ఉన్నారు. తాజాగా రామ్ చరణ్, ఉసాసన దంపతులు కూడా  కుమార్తెకి జ‌న్మ‌నివ్వ‌డంతో చిరంజీవి ఇంట్లోకి ఐదో ధనలక్ష్మీ వచ్చిందని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. వారుసుడు పుడితే బాగుంటుంద‌ని కొంద‌రు అనుకుంటున్న‌ప్ప‌టికీ, . ఆడైనా.. మగైనా మెగా ఇంటికి ఓ వారసురాలు రావడం మాత్రం ఆనందించదగ్గ పరిణామం అని మ‌రి కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు ఇటీవ‌లే త‌మ 11వ యానివ‌ర్స‌రీ జ‌రుపుకున్నారు. ఇక ఈ రోజు ఆషాఢ మాసం శుక్ల విదియ.. పునర్వసు నక్షత్రం .. కావ‌డంతో ఎలాంటి దోష కారి కాదు. అందుకే రామ్ చ‌ర‌ణ్‌ దంపతులు.. జూన్ 20న  డాక్టర్ల సలహా మేరకు తమ కొత్త బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రామ్ చ‌ర‌ణ్‌కి  ‘రంగస్థలం’ చిత్రం తర్వాత నుంచి మంచి గుర్తింపు వ‌చ్చింది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన పాన్ ఇండియా స్టార్‌గా మారారు. ప్ర‌స్తుతం శంక‌ర్ దర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు. దీని త‌ర్వాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ లో కూడా ఓ చిత్రం చేయ‌నున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...