Home Film News Allu Arjun: మ‌ళ్లీ మెగా ఫ్యాన్స్‌కి మంట పెట్టిన అల్లు అర్జున్.. గొడ‌వ‌ల ప్ర‌స్థానం కొన‌సాగేనా?
Film News

Allu Arjun: మ‌ళ్లీ మెగా ఫ్యాన్స్‌కి మంట పెట్టిన అల్లు అర్జున్.. గొడ‌వ‌ల ప్ర‌స్థానం కొన‌సాగేనా?

Allu Arjun: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్ర‌త్యేక‌మైన గౌర‌వం ఉంది. స్వ‌యంకృషితో మెగాస్టార్‌గా ఎదిగిన చిరంజీవి త‌న ఫ్యామిలీకి సంబంధించి చాలా మంది స్టార్స్ ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేశాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ,రామ్ చ‌ర‌ణ్‌, సాయిధ‌రమ్ తేజ్, వ‌రుణ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా ప‌లువురు హీరోలు ఇప్పుడు ఇండ‌స్ట్రీని ఏలుతున్నారు. అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇన్నాళ్లు మెగా ఫ్యామిలీ హీరోగానే ప్ర‌త్యేక గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కాని ఇటీవ‌ల మాత్రం మనోడు అల్లు వారసుడిగా ఎక్కువ‌గా ప్రొజెక్ట్ అవుతున్నాడు. అప్ప‌ట్లో ఓ సారి ‘చెప్పను బ్రదర్’ అనే మాటతో చిచ్చు రాజేసిన బ‌న్నీ ఇప్పుడు రీసెంట్‌గా ఓ కార్య‌క్ర‌మంలో గెస్ట్‌గా వ‌చ్చి కూడా మెగా ఫ్యాన్స్‌కి మంట‌పెట్టాడు.

ఇటీవ‌ల బ‌న్నీ చేసే కామెంట్స్ వ‌ల‌నే ‘మెగా vs అల్లు’వారి ఫ్యాన్స్ గొడవల ప్రస్థానం ఇంకా కొనసాగుతుందని కొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్నారు. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియా లోనే ఈ ర‌చ్చ ఉండేది. ఇప్పుడు అభిమాన సంఘాల మీటింగ్స్ లో కూడా ఊహించని విధంగా మాటల యుద్ధం జ‌రుగుతుంది. సినీ పరిశ్రమలోకి చిరంజీవి కుటుంబ హీరోగా వ‌చ్చిన బ‌న్నీకి ఫౌండేషన్ పడింది మెగా క్యాంప్ నుంచే అనే విష‌యం అంద‌రికి తెలిసిందే. ఐతే ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ క్ర‌మేపి మెగా క్యాంప్ నుండి దూరం జ‌రుగుతున్న‌ట్టు అంద‌రికి అర్ధ‌మ‌వ‌తుంది.

 

అల వైకుంఠపురం చిత్రంతో భారీ విజయాన్ని సాధించిన బన్నీ ఇక అక్క‌డ నుండి అల్లు హీరోగానే త‌న‌కు తాను చెప్పుకుంటున్నాడు. చిరంజీవి పేరు తీయ‌కుండా త‌న తండ్రి పేరు తన తాత పేరు ఎక్కువ‌గా ఉప‌యోగిస్తూ అల్లు పేరుని , ఆ ఇంటి వారిని హైలైట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్‌గా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కి గెస్ట్ గా విచ్చేసిన అల్లు అర్జున్.. మా నాన్న నాకు దైవంతో సమానం అని ఓ సంద‌ర్భంలో మాట్లాడారు. నాకు అన్నీ ఇచ్చిన నాన్నే నాకు దేవుడు అని చెప్పిన బ‌న్నీ, తన ఫేమ్ నేమ్ కి కారణం కూడా నాన్న అని అర్ధం వ‌చ్చేలా మాట్లాడారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కొంద‌రు మెగా ఫ్యాన్స్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. చిరంజీవి నీకు ఇన్నాళ్లు స‌పోర్ట్ ఇచ్చింది వేస్ట్ అన్న‌ట్టేనా అంటూ ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ఈ వివాదం ఇంకెంత ముందుకు పోతుందో చూడాలి.

Related Articles

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

బాలయ్య లైఫ్ లోనే మర్చిపోలేని పీడ కల .. ఎన్ని సంవత్సరాలు మ‌రీన‌ మాయని గాయం ఇదే..!

టాలీవుడ్‌లోనే నంద‌మూరీ బాలకృష్ణకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో...

25 లక్షల కోసం ఆ ‘పొలిటీషియన్’తో అంటూ అనుచిత వ్యాఖ్యలు.. “పోరంబోకు వెధవ”.. కోపంతో రెచ్చిపోయిన త్రిష!

ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్లపై చీప్ కామెంట్స్ వల్గర్ గా...

చివరికి నాగచైతన్య పరిస్థితి ఏంటి ఇలా తయారయ్యింది… సమంత చెప్పినట్లే అయిందిగా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎలాంటి ప్రత్యేకత ఉందో అందరికీ తెలిసిందే..నట సామ్రాట్...