Home Film News Bhola Shankar: ఏంటి.. భోళా శంక‌ర్ చిత్రానికి అన్ని కోట్ల న‌ష్టం వాటిల్లిందా..!
Film News

Bhola Shankar: ఏంటి.. భోళా శంక‌ర్ చిత్రానికి అన్ని కోట్ల న‌ష్టం వాటిల్లిందా..!

Bhola Shankar: రీఎంట్రీ త‌ర్వాత వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తున్న చిరంజీవి రీసెంట్‌గా భోళా శంక‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త‌మ‌న్నా క‌థానాయిక‌గా న‌టించ‌గా, కీర్తి సురేష్ .. చిరు చెల్లెలి పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేసింది. త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి రీమేక్‌గా భోళా శంక‌ర్ చిత్రం తెర‌కెక్క‌గా, ఈ మూవీ ఆగ‌స్ట్  11న విడుద‌లై ప్రేక్ష‌కుల‌ని చాలా నిరాశ‌ప‌ర‌చింది.  చిరంజీవి  కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా భోళా శంక‌ర్ చిత్రం నిలిచింది. తొలి షో నుండే ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలు రావ‌డంతో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గాయి.

భోళా శంక‌ర్ చిత్రం తొలి రోజు రూ.15 కోట్ల షేర్ వసూలు చేయ‌గా, తర్వాతి రెండు రోజులు అందులో ఐదో వంతు మాత్రమే వసూలు చేసిందంటే ఈ చిత్రం ఎంత దారుణంగా ఆడిందో అర్ధ‌మ‌వుతుంది. ఇప్పుడు అయితే కనీసం క‌లెక్షన్స్ లేక థియేట‌ర్ రెంట్ కూడా రాని పరిస్థితి ఉంద‌ట‌.  ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్ర‌కారం.. భోళాశంక‌ర్  సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.79 కోట్లు కాగా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి రూ.40 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం  షేర్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే రాబ‌ట్ట‌గా, బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా రూ.55  కోట్ల దూరంలో ఉంది.

ఇంత డిజాస్ట‌ర్‌గా భోళా శంక‌ర్ చిత్రం కావ‌డం అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.  భోళా శంకర్ చిత్రం డిస్ట్రిబ్యూట‌ర్స్‌ని సైతం చాలా పెద్ద దెబ్బ తీసిన‌ట్టు టాక్. అయితే సినిమా ఇంత ఫ్లాప్ కావ‌డానికి కార‌ణం ఎవ‌రని కూడా ఇప్పుడు నెటిజ‌న్స్ విశ్లేషిస్తున్నారు. సినిమా  ఫెయిల్యూర్  విషయంలో మెహర్ రమేష్ కన్నా చిరంజీవిదే తప్పు అని చాలా మంది అంటున్నారు.  ఒక రీమేక్ సినిమా  తీసేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోకుండా చిరంజీవి చాలా లైట్ తీసుకున్నార‌ని అంటున్నారు.చిరంజీవి అంత‌టి వాడు జ‌బ‌ర్ధ‌స్త్ గ్యాంగ్ తో క‌లిసి చీప్ కామెడీ చేయ‌డ‌మేంట‌ని కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక ఈ మ‌ధ్య కాలంలో హిట్ లేని మెహ‌ర్ ర‌మేష్‌తో సినిమా ఎలా ఒప్పుకున్నాడ‌ని కూడా మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...