Home Film News Guntur Karam: గుంటూరు కారం క‌థ లీక్.. మ‌హేష్ బాబు అలా క‌నిపిస్తాడా..!
Film News

Guntur Karam: గుంటూరు కారం క‌థ లీక్.. మ‌హేష్ బాబు అలా క‌నిపిస్తాడా..!

Guntur Karam: స‌ర్కారు వారి పాట సినిమాతో చివ‌రిగా ప‌ల‌కరించిన మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ న‌త్త‌న‌డ‌కన సాగుతున్న‌ట్టు తెలుస్తుంది. కొంద‌రు టెక్నీషియన్స్‌ని మ‌ధ్య‌లో తొల‌గించ‌డం లేదంటే, మ‌హేష్ షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి విహార‌యాత్ర‌ల‌కి వెళ్ల‌డం వ‌ల‌న చిత్రీక‌ర‌ణ ఆలస్యం అవుతూ వ‌స్తుంది.ఇక ఈ చిత్రం క‌థ  ప‌లుసార్లు మారింద‌ని ఇటీవ‌ల ప్ర‌చారం సాగింది. ఏది ఏమైన ఈ సినిమాకి సంబంధించి జ‌రుగుతున్న ప్ర‌చారం మాత్రం మ‌హేష్ అభిమానులని మాత్రం కొంత ఆవేద‌న‌కి గురి చేస్తుంది.

ఇక ఇదిలా ఉంటే గుంటూరు కారం  సినిమా స్టోరీ లైన్ అంటూ ఒక కథ ప్రచారంలోకి  రాగా, దీనిపై అభిమానులలో అనేక అనుమానాలు త‌లెత్తుతున్నాయి.   పాపులర్ వెబ్ సైట్  అయిన ఐఎమ్‌డీబీ ఈ సినిమా గురించి ఒక సినాప్సిస్ ఇవ్వ‌గా, అందులోని క‌థ‌నం ప్ర‌కారం   మ‌హేష్‌బాబు గుంటూరు డాన్‌గా క‌నిపించ‌బోతున్నారని, సిటీలో జ‌రిగే అన్యాయాలు అక్ర‌మాల‌పై పోరాడుతోన్న ఓ జ‌ర్న‌లిస్ట్‌తో మ‌హేష్‌బాబు ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ని, ఆమె ల‌క్ష్యానికి ఆ డాన్ ఎలా అండ‌గా నిలుస్తాడ‌న్న‌ది చిత్ర క‌థ‌గా చెబుతున్నారు. చాలా స‌ర్‌ప్రైజ్‌లతో క‌థ‌ని త్రివిక్ర‌మ్ డిజైన్ చేశాడ‌ని చెబుతున్నారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

ఇక అత‌డు, ఖ‌లేజా వంటి చిత్రాల  త‌ర్వాత మ‌హేష్‌బాబు, త్రివిక్ర‌మ్ కాంబోలో గుంటూరు కారం అనే చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాని  హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మిస్తుండ‌గా, మూవీకి  త‌మ‌న్ అద్భుత‌మైన‌ సంగీతాన్ని అందిస్తోన్నాడు.  మహేశ్ బాబుతో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేస్తున్న మూడో సినిమా ఇది కాగా, వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ చిత్రం హ్యాట్రిక్ కొడుతుందని కొంద‌రు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు సినిమాకి సంబంధించి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై అయితే అంచ‌నాలు భారీగా పెంచాయి. ఇక ఈ సినిమా పూర్తైన త‌ర్వాత మ‌హేష్ బాబు.. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం చేయ‌నున్నాడు.  ఈ సినిమా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొంద‌నుంది

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...