Home Film News Trend: ఇప్పుడు గుండు ఓ ట్రెండ్.. చిరు నుండి స‌ల్మాన్ వ‌ర‌కు ఎవ‌రెవ‌రు గుండులో ద‌ర్శ‌నమిచ్చారు..!
Film News

Trend: ఇప్పుడు గుండు ఓ ట్రెండ్.. చిరు నుండి స‌ల్మాన్ వ‌ర‌కు ఎవ‌రెవ‌రు గుండులో ద‌ర్శ‌నమిచ్చారు..!

Trend: సినీ ప‌రిశ్ర‌మ‌లో ఒక్కోసారి ఓ ట్రెండ్ న‌డుస్తుంది. ఆ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టు హీరోలు న‌డుచుకుంటూ ఉంటారు. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వ‌ర‌కు ఆ ట్రెండ్‌ని ఫాలో కావ‌ల్సిందే. అయితే కొన్నిసార్లు పాత్ర కోసం స్టార్ హీరోలు సైతం గుండు చేయించుకొని స‌ర్‌ప్రైజింగ్ లుక్‌లో క‌నిపిస్తుంటారు. అలా గుండులో  ద‌ర్శ‌న‌మిస్తూ ట్రెండ్‌ని ఫాలో అయిన హీరోలు ఎవ‌ర‌నేది చూస్తే..ఈ లిస్ట్‌లో చాలా మంది స్టార్ హీరోలే ఉన్నారు. ఇటీవ‌ల షారూఖ్ న‌టించిన జ‌వాన్ గ్లింప్స్ ఒక‌టి విడుద‌ల కాగా, అందులో షారూఖ్ గుండులో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.  తొలిసారి సౌత్ డైరెక్టర్ అట్లీతో క‌లిసి సినిమా చేస్తున్న షారూఖ్.. ఈ సినిమా కోసం గుండుతో క‌నిపించ‌డం ఆస‌క్తిని రేపుతుంది.  షారూఖ్ లాంటి సూపర్ స్టార్ ఇలా గుండుతో క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఇక బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా రీసెంట్‌గా గుండులో క‌నిపించారు. విష్ణు వ‌ర్ధ‌న్‌తో స‌ల్మాన్ త‌న త‌దుపరి సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమా కోసం స‌ల్మాన్ ఇలా గుండు చేయించుకున్నార‌నే టాక్ న‌డుస్తుంది. ఇక కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ కూడా తన త‌దుప‌రి సినిమాలో గుండుతో కనిపించబోతున్నారు. కెప్టెన్ మిల్లర్ కోసం చాలా కాలంగా లాంగ్ హెయిర్‌, థిక్ బియర్డ్ మెయిన్‌టైన్ చేసిన  ధ‌నుష్ త‌న త‌దుప‌రి సినిమా కోసం గుండు చేయించుకున్నాడు. ఇక అల్లు అర్జున్ న‌టించిన పుష్ప సినిమాలో గుండుతో క‌నిపించిన మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్  తొలి భాగంలో కొద్ది సేపే కనిపించిన  సీక్వెల్‌లో మాత్రం  ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు.

మ‌ల‌యాళ స్టార్ హీరో మోహ‌న్ లాల్ కూడా గుండులో సంద‌డి చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం సెట్స్ మీద ఉన్న చిత్రం కోసం మోహ‌న్ లాల్ కూడా గుండు చేయించుకున్నాడ‌ట‌.  స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బారోజ్‌ మూవీ కోసం డిఫరెంట్ గెటప్‌ ట్రై  చేసినట్టు తెలుస్తుంది.  ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి సైతం గుండు లుక్ ట్రై చేసి స‌రికొత్త లుక్‌లో క‌నిపించి ఆశ్చర్య‌ప‌రిచారు.  ఈ లుక్‌తో ఏ సినిమా చేయ‌లేదు కాని ఎందుకో గుండ్ లుక్ ఓసారి ట్రై చేశారు. మెగాస్టార్ షేవ్డ్‌ లుక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...