Home Film News Chiranjeevi: ఇష్టం లేకున్నా కూడా కూతుర్ల కోసం చిరంజీవి ఈ వయ‌స్సులో ఏం చేస్తున్నాడంటే..!
Film News

Chiranjeevi: ఇష్టం లేకున్నా కూడా కూతుర్ల కోసం చిరంజీవి ఈ వయ‌స్సులో ఏం చేస్తున్నాడంటే..!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఇప్పుడు మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారు. చిరంజీవిని స్పూర్తిగా తీసుకొని ఇండ‌స్ట్రీకి చాలా మంది వ‌చ్చారు. ఇక మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలుగా ఎదుగుతున్నారు. ప‌వన్ క‌ళ్యాణ్ నుండి వైష్ణ‌వ్ తేజ్ వ‌ర‌కు అంద‌రు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే మెగా డాట‌ర్స్ మాత్రం పూర్తిగా నిరాశప‌రుస్తున్నారు. నిహారిక హీరోయిన్‌గా ప‌లు సినిమాలు చేసిన కూడా పెద్ద‌గా పేరు తెచ్చుకోలేదు. దీంతో పెళ్లి చేసుకొని కొన్నాళ్లు సైలెంట్ అయింది. ఇక విడాకుల త‌ర్వాత తిరిగి సినిమాల‌లో స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది.  ఇక చిరు పెద్ద కూతురు మొద‌ట్లో కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేసింది. ఇప్పుడు నిర్మాత‌గా స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తుంది.

గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనే సంస్థ‌ని సుస్మిత మొద‌లు పెట్ట‌గా, ఇప్పుడు ఈ బేన‌ర్‌లో త‌న త‌దుపరి సినిమా చేయ‌బోతున్న‌ట్టు చిరు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. ఇక  కూతురే నిర్మాత కాబట్టి.. మంచి డైరెక్టర్ కోసం చిరంజీవి వెయిట్ చేస్తున్నార‌ట‌.  కూతురు చేసే మొదటి సినిమాకి మంచి లాభాలు రావాల‌ని చిరు ఆచితూచి అడుగులు వేస్తున్నాడ‌ట‌. ఈ చిత్రం హిట్ అయితే సుస్మిత‌కి ఇండ‌స్ట్రీలో గ్రోత్ ఉంటుందని భావించిన చిరు  ఈ వయసులో కూడా తాను రెస్ట్ తీసుకోకుండా కూతురు సినిమా కోసం అన్నీ తానై  చూసుకుంటున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. అస‌లు చిరంజీవికి త‌న కూతురిని నిర్మాతగా చేయ‌డం ఏ మాత్రం ఇష్టం లేద‌ట‌. అందుకు కార‌ణం ఒక్క సినిమా ఫ్లాప్ అయిన కూడా చాలా న‌ష్టాలు ఎదుర్కోవ‌ల‌సి వ‌స్తుంది.

అయితే సుస్మిత నిర్మాత‌గానే చేస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టుకు కూర్చోవ‌డంతో చిరు త‌న వంతు సాయం కూడా చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. ఇక చిరు విష‌యానికి వ‌స్తే..  వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు.   డెబ్బై ఏళ్లకు దగ్గరకి వస్తున్నా కూడా ఇంకా  కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు.  ఇటీవ‌ల వ‌చ్చిన భోళా శంక‌ర్ డిజాస్ట‌ర్ కావ‌డంతో కొద్ది రోజుల పాటు సినిమాల‌కి బ్రేక్ తీసుకుంటార‌ని అంద‌రు భావించారు. కాని ఆయ‌న త‌న బ‌ర్త్ డే రోజు రెండు సినిమాలు ప్ర‌క‌టించారు.అందులో ఒకటి బింబిసార డైరెక్టర్ వశిష్టతో  చేయ‌నున్న మూవీ కాగా, రెండోది త‌న కూతురు నిర్మించ‌నున్న చిత్రం. ఈ చిత్రాల‌తో చిరు క‌మ్‌బ్యాక్ ఇవ్వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...