NTR FAN
Jr NTR Fan Putta Sai Ram: రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించండి.. మా ఇంట్లో జరిగిన సంఘటన మరే ఇంట్లోనూ జరక్కూడదు.. అంటూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల ప్రారంభంలో చెప్తుంటారు. నందమూరి కుటంబంలో నందమూరి జానకి రామ్, హరికృష్ణ రోడ్డు ప్రమాదాల్లోనే మరణించారు.
వారి మరణం, కుటుంబానికి, అభిమానులకు, పార్టీ శ్రేణులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. తారక్ ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ తన స్పీచ్ చివర్లో అభిమానులు క్షేమంగా ఇంటికి చేరుకోవాలని.. తమ కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని విజ్ఞప్తి చేస్తుంటారు.
నిన్న (జూలై 29) జరిగిన ‘బింబిసార’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ.. అన్నయ్య కళ్యాణ్ రామ్‌కి కానీ, నాకు కానీ ఎలాంటి ఆస్తిపాస్తులు అవసరం లేదు.. మీ అభిమానం చాలు.. వర్షాకాలం, జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోండని చెప్పారు. ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది.. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్‌ని చూశాం.. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ‘బింబిసార’ మూవీకి థియేటర్లలో హంగామా చేద్దాం అని ప్లాన్ చేసుకుంటున్న ఫ్యాన్స్‌కి ఓ షాకింగ్ న్యూస్ తెలిసింది.
‘బింబిసార’ ఫంక్షన్‌కి వచ్చిన ఓ అభిమాని మరణించాడు. వెస్ట్ గోదావరి, పెంటపాడు మండలానికి చెందిన నందమూరి వీరాభిమాని పుట్టా సాయిరాం, S/O రాంబాబు మరణించాడనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.
‘ఇది దురదృష్టకరమైన మరియు హృదయ విదారక సంఘటన.. సాయిరాం ఆత్మకు శాంతికలగాలని ప్రార్థిస్తున్నాం’ అంటూ ‘బింబిసార’ టీమ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు. సాయిరాం ఆత్మకు శాంతిచేకూరాలని నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా నివాళులర్పిస్తున్నారు.
Julayi Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ ఫిలిం..…
Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్..…
Bigg Boss Telugu 6 Promo: Worlds బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ న్యూ సీజన్ వచ్చేస్తోంది. ‘బిగ్…
Mahesh Babu: ‘సూపర్ స్టార్’, ‘నటశేఖర’ కృష్ణ గారి నటవారసుడు.. చిన్నతనంలోనే స్టార్ డమ్ తెచ్చుకున్న ‘ప్రిన్స్’.. రీల్ లైఫ్‌తో…
Mahesh Babu: ఆగస్టు 9.. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు.. ఘట్టమనేని అభిమానులకు పండుగరోజు.. 2022 ఆగస్టు 9న…
Bimbisara: ‘బింబిసార’గా బాక్సాఫీస్ బరిలో సందడి చేస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. భారీ బడ్జెట్‌తో, టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌లో,…
This website uses cookies.