Home Film News Allu Arjun : కిరాక్ లుక్.. ‘ఐకాన్ స్టార్’ స్వాగ్..
Film News

Allu Arjun : కిరాక్ లుక్.. ‘ఐకాన్ స్టార్’ స్వాగ్..

Allu Arjun
Allu Arjun

Allu Arjun: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క లుక్‌తో ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చాడు బన్నీ. ‘పుష్ప’ తో పాన్ ఇండియా స్టార్ అయిన అల్లు అర్జున్‌తో తమ బ్రాండ్ ఎండార్స్ చేసేందుకు పలు బిజినెస్ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పటికే జూమాటో, రెడ్ బస్, ఫ్రూటీ లాంటి సంస్థలకు బన్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌, హరీష్ శంకర్‌ల డైరెక్షన్లో యాడ్స్ చేస్తున్నాడు.

హరీష్ శంకర్‌తో అల్లు అర్జున్ ఆస్ట్రాల్ పైప్స్ (Astral Pipes) యాడ్ చేస్తున్నాడు. వరల్డ్ క్లాస్ డీఓపీ సుదీప్ ఛటర్జీ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. థాయ్‌లాండ్‌లో ఈ యాడ్ షూటింగ్ జరుగుతుంది. ఈ యాడ్ కోసం బన్నీ సరికొత్త లుక్‌లోకి మారిపోయాడు. రెడ్ షర్ట్ పైన బ్లాక్ లెదర్ జాకెట్ వేసుకుని, బ్లాక్ గాగుల్స్‌తో నోట్లో సిగార్ పెట్టుకుని ఉన్న స్టైలిష్ లుక్ మామూలుగా లేదసలు..

ఫస్ట్ ఈ లుక్ చూడగానే చాలామంది తమిళస్టార్ సూర్య అనుకున్నారు. కన్నడ కస్తూరి.. ‘పుష్ప’ రాజ్ జోడీ, శ్రీవల్లి, రష్మిక కూడా ఒక సెకండ్ గుర్తుపట్టలేకపోయానని ట్వీట్ చేసింది. ఇక ఫ్యాన్స్ సంగతైతే చెప్పక్కర్లేదు. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ మూవీలో బన్నీ లుక్ సాలిడ్‌గా ఉంటుంది. సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. సూర్య రోల్‌లో తన మేకోవర్ చాలా బాగుంటుంది. అల్లు అర్జున్ పాత్ర కోసం ఎంతలా ప్రాణం పెడతాడు అనే విషయం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

‘‘2018 ‘నా పేరు సూర్య’ కి 2022లో ఈ యాడ్ లుక్‌కి సిమిలారిటీ ఉంది.. ఇదీ ‘ఐకాన్ స్టార్ స్వాగ్’.. ఈ లుక్‌తో ఓ ఫుల్ లెంగ్త్ గ్యాంగ్‌స్టర్ రోల్ చేస్తే అదిరిపోద్ది.. సార్, సుకుమార్ గారూ.. ‘పుష్ప 2’ లో ఈ లుక్‌తో కొన్ని సీన్స్ ప్లాన్ చెయ్యండి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్..

ప్రస్తుతం బ్రిలియంట్ డైరెక్టర్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్ ‘పుష్ప – ది రూల్’ స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో సెట్స్ మీదకెళ్లే అవకాశముందని తెలుస్తోంది. షూటింగ్ స్టార్ట్ అయ్యేలోగా బన్నీ మొత్తం ఐదు బ్రాండ్లకు చెందిన యాడ్స్ చెయ్యబోతున్నాడు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...