Home Film News Meher Ramesh-World Cup: మెహ‌ర్ ర‌మేష్ తీసిన ఫ్లాప్‌తో టీమిండియా వ‌రల్డ్ క‌ప్ కొట్టేస్తుందా..!
Film News

Meher Ramesh-World Cup: మెహ‌ర్ ర‌మేష్ తీసిన ఫ్లాప్‌తో టీమిండియా వ‌రల్డ్ క‌ప్ కొట్టేస్తుందా..!

Meher Ramesh-World Cup: ఏంటి మెహ‌ర్ ర‌మేష్ తీసిన భోళా శంకర్ ఫ్లాప్ వ‌ల‌న ఈ ఏడాది టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ కొడుతుందా..ఇది నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉన్నా కూడా కొంద‌రు మాత్రం ఇది జ‌రుగుతుంద‌ని సాక్ష్యాల‌తో చెప్పుకొస్తున్నారు. చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన భోళా శంకర్ చిత్రం ఫ్లాప్ కావ‌డం మెగా అభిమానుల‌ని చాలా బాధిస్తుంది. అయితే భోళా శంకర్ ఫ్లాప్ కావడం ఓ రకంగా మంచిదేన‌ని, దాని వ‌ల‌న  ఈ ఏడాది భారత్ వరల్డ్ కప్ గెలవడం ఖాయమని జోస్యం చెప్పుకొస్తున్నారు. అదేంటి భోళా శంక‌ర్ ఫ్లాప్‌కి,  టీమిండియా వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డానికి సంబంధం ఏంటనే క‌దా మీ డౌట్.. ఇప్పుడు ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.

చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో త‌మిళ మూవీ వేదాళంకి రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌గా,  ఈ చిత్రం ఆగ‌స్ట్ 11న విడుద‌లైంది. భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ఈ సినిమా ఫ్లాప్‌తో మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ ట్రోఫీ అందుకోవ‌డం ఖాయం అని చెబుతూ ప‌లు ఆధార‌లు చూపిస్తున్నారు. 2011లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో, ఎన్టీఆర్ హీరోగా  శ‌క్తి అనే సినిమా విడుద‌లైంది. ఈ చిత్రం జూనియ‌ర్ కెరీర్లోనే డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా విడుద‌లైన‌ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌గా, అందులో ధోని సేన వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంది. ఇక 2013లో మెహర్ .. వెంకటేశ్ హీరోగా తెరకెక్కిన ‘షాడో’ అనే సినిమా తెర‌కెక్కించ‌గా, ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

అదే  ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భార‌త్ టైటిల్‌ని గెలుచుకుంది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించిన ధోనీ సేన.. ట్రోఫీని ఎగరేసుకెళ్లింది. ఇక ఈ ఏడాది మెహర్ రమేశ్ దర్శకత్వంలో వచ్చిన భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్ట‌గా, ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రుగుతుంది. పాత సెంటిమెంట్ ప్ర‌కారం భార‌త్ ఖాతాలో మ‌రో వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌చ్చి చేర‌డం ఖాయం అని అంటున్నారు. చూడాలి మ‌రి మెహ‌ర్ ర‌మేష్ సెంటిమెంట్ ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...