Home Film News Samantha: ఎవ‌రి కోస‌మో బ్ర‌త‌క‌క్క‌ర్లేదు.. స‌మంత షాకింగ్ కామెంట్స్
Film News

Samantha: ఎవ‌రి కోస‌మో బ్ర‌త‌క‌క్క‌ర్లేదు.. స‌మంత షాకింగ్ కామెంట్స్

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.సినిమాల నుండి కొద్ది విరామం తీసుకున్న ఈ భామ  తెగ చక్క‌ర్లు కూడా కొడుతుంది. పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించ‌డం అలానే  విదేశాలకు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్ చేయ‌డం వంటివి చేస్తుంది. ఇక కొన్నాళ్లుగా మ‌యోసైటిస్ తో బాధ‌ప‌డుతున్న స‌మంత  త్వ‌ర‌లోనే ఆమె చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు రెడీ అవుతుంది. అయితే స‌మంత కొద్ది రోజులుగా  సోష‌ల్ మీడియాలో ఫిలాస‌ఫీ కోట్స్ పెడుతూ హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇవి చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి.  బొద్దింక‌ను చంపితే హీరో అవుతారు. సీతాకోక చిలుక‌ను చంపితే విల‌న్ అవుతారు. నైతిక‌కు కూడా సౌంద‌ర్య ప్ర‌మాణాలు ఉన్నాయి అంటూ స‌మంత స్ట‌న్నింగ్ కోట్ పెట్టింది. ఇది ఎవ‌రి గురించి పెట్టింద‌ని అంద‌రు ఆలోచ‌న‌లో ప‌డ్డారు.

ఇక స‌మంత న‌టించిన తాజా చిత్రం ఖుషీ కాగా, ఈ మూవీ ట్రైల‌ర్ లాంచింగ్ వేడుక ఇటీవ‌ల జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స‌మంత హాజ‌రు కాలేదు. దాంతో ఆమెపై దారుణ‌మైన ట్రోల్ చేశారు విజ‌య్ అభిమానులు. అయితే వారికి  సమంత పరోక్షంగా సమాధానం చెప్పిన‌ట్టు క‌నిపిస్తుంది. త‌న సోష‌ల్ మీడియాలో  ఓ కోట్ షేర్ చేయ‌గా, అందులో  ‘మీరు ఈ లోకం కోసం బ్రతకాల్సిన పనిలేదు. మీ గౌరవం ఏమిటో తెలుసుకోండి. మీ స్థాయిని పెంచుకోండి. మీరు మీ కోసం బ్రతకండి ఈ సమాజం కోసం కాదు. మిమ్మల్ని ఈ సమాజం గుర్తించకపోవచ్చు. అది అంత అవసరం లేదు. పది మందిలో ఒకరిలా కాకుండా యూనిక్ గా జీవించండి’ అని రాసుకొచ్చింది.

మీరు ఎంత చేసిన విమ‌ర్శించే వాళ్లు విమ‌ర్శిస్తూనే ఉంటారు. వారి కోసం ఏ మాత్రం ఆలోచించకూడ‌దు. మ‌న శైలిని ఏ మాత్రం మార్చుకోవ‌ద్దు అని స‌మంత సూచించించింది. అయితే స‌మంత చేసిన కామెంట్స్ ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ గురించిఏ అని నెటిజ‌న్స్ అంటున్నారు.  ఇక స‌మంత న‌టించిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా,  ఈ సినిమాపై స‌మంత చాలా హోప్స్ పెట్టుకుంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మూవీ తెర‌కెక్క‌గా, ఈ చిత్రంలోని పాట‌ల‌కి సూప‌ర్భ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...