Home Film News Varun Tej-Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి వారిని అస్స‌లు పిల‌వ‌ర‌ట‌.. కార‌ణం ఏంటంటే..!
Film News

Varun Tej-Lavanya Tripathi: వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి వారిని అస్స‌లు పిల‌వ‌ర‌ట‌.. కార‌ణం ఏంటంటే..!

Varun Tej-Lavanya Tripathi: మెగా హీరో వ‌రుణ్ తేజ్- అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి కొన్నాళ్లుగా ప్రేమ‌లో మునిగి తేలుతున్న విష‌యం తెలిసిందే. అయితే వారి ప్రేమ గురించి ఎన్ని వార్త‌లు వ‌చ్చిన కూడా ఏ మాత్రం స్పందించ‌లేదు. కాని సైలెంట్‌గా జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకొని పెద్ద షాక్ ఇచ్చారు. ఇక నిశ్చితార్థంకి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ కావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు కూడా ఈ జంట‌కి ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఇక ఎంగేజ్‌మెంట్ తర్వాత వరుణ్ లావణ్య ఫారిన్ ట్రిప్‌కు వెళ్లి ఫుల్ మ‌స్తీ చేశారు.అందుకు సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట వైర‌ల్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా కాఫీ డేట్‌కు కూడా వెళ్ళి వచ్చారు. ఇక వీరి పెళ్లి ఎప్పుడు జ‌రుగుతుందా అని జోరుగా చ‌ర్చ సాగుతుంది.

ఈ క్ర‌మంలో పెళ్లి డేట్.. వరుణ్-లావణ్య ఒక్కటయ్యే క్షణం వచ్చే సింది.. ఆగస్టు 24వ తేదీన.. ఇటలీలో వీరి వివాహం గ్రాండ్‌గా జరగనుందని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. అక్కడే వారి ప్రేమ చిగురించగా, పెళ్లి కూడా అక్క‌డే చేసుకోవాల‌ని ఆ జంట భావిస్తుంది. ఇటీవ‌ల ఇటలీకి వెళ్లిన ఈ జంట పెళ్లి ప‌నులని దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట. ఇక పెళ్లికి ఎవరెవ‌రిని ఆహ్వానిస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతుండ‌గా, ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌మ పెళ్లికి కేవలం అల్లు , మెగా ఫ్యామిలీలని మాత్ర‌మే ఆహ్వానిస్తున్నార‌ట‌. అక్క‌డ వారి కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నార‌ట‌. ఇక ఇండస్ట్రీలోని మిగతా సినీ సెలబ్రిటీలను అలాగే రాజకీయ నాయకులని పెళ్లికి కాకుండా రిసెప్ష‌న్‌కి ఇన్వైట్ చేయ‌నున్నార‌ట‌.

హైద‌రాబాద్‌లో గ్రాండ్ పార్టీ ప్లాన్ చేసి అప్పుడు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ని నాగ‌బాబు ఆహ్వానించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. నిహారిక విడాకుల ప్ర‌క‌ట‌న జ‌రిగిన కొద్ది రోజుల‌కే లావ‌ణ్య వ‌రుణ్ తేజ్ ల పెళ్లి జ‌ర‌గ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇక 2017లో విడుదలైన మిస్టర్‌ సినిమాలో తొలిసారి వరుణ్‌- లావణ్య కలిసి నటింగా, ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్ప‌డింది. ఇక ఆ తర్వాత ఏడాదిలోనే వీరి కాంబినేషన్‌లో అంతరిక్షం సినిమా రాగా, ఆ స‌మ‌యంలో ఆ ఫ్రెండ్షిప్ ప్రేమ‌గా మారింది. ఆరేళ్ల నుండి ప్రేమ‌లో మునిగి తేలుతున్న ఈ జంట ఎట్ట‌కేల‌కు జూన్ 9న నిశ్చితార్థం జ‌రుపుకున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...