Home Film News Venkatesh: ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌రో వార‌సుడు..ద‌గ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..!
Film News

Venkatesh: ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న మ‌రో వార‌సుడు..ద‌గ్గుబాటి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌..!

Venkatesh: సినిమా ఇండ‌స్ట్రీకి వార‌సుల రాక కొత్తేమి కాదు. అప్ప‌టి స్టార్ హీరోల పిల్ల‌లు ఇండ‌స్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. చిరంజీవి, నాగార్జున త‌న‌యులు ఇప్పుటికే సినీ ప‌రిశ్ర‌మ‌లో సంద‌డి చేస్తుండ‌గా, బాల‌కృష్ణ త‌న‌య‌డు మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీకి కూడా టైం ఫిక్స్ అయింది. ఇటీవ‌ల మోక్ష‌జ్ఞ స్లిమ్ లుక్ ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో ఇక ఆయ‌న ఎంట్రీకి పెద్ద స‌మ‌యం లేద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చారు నంద‌మూరి ఫ్యాన్స్. అయితే మొద‌టి నుండి త‌న ఫ్యామిలీని మీడియాకి దూరంగా ఉంచుతున్న వెంక‌టేష్ ఇప్పుడు త‌న కొడుకును ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం వెంకీ త‌న‌యుడి ఆరంగేట్రంకి సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

దగ్గుబాటి రామానాయుడు టాలీవుడ్ నిర్మాత‌గా త‌న స‌త్తా చాటాడు. ఆయ‌న త‌న‌యులు సురేష్ బాబు, వెంక‌టేష్ సినీ ప‌రిశ్ర‌మలోకి అడుగుపెట్టి ఒక‌రు నిర్మాత‌గా, ఒక‌రు హీరోగా రాణిస్తున్నారు. ఇక ద‌గ్గుబాటి సురేష్ బాబు త‌న‌యుల‌లో ఒక‌రైన రానా మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఇక చిన్న కొడుకు ఇటీవ‌ల అహింసా చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ సినిమా అంత‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఇక ఇదిలా ఉంటే ద‌గ్గుబాటి ఫ్యామిలీ నుండి మ‌రో హీరో సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్ట‌నున్న‌ట్టు చెబుతున్నారు.

 

విక్ట‌రీ వెంక‌టేష్‌కి 18 ఏళ్ల వయస్సు ఉన్న అర్జున్ అనే కొడుకు ఉన్నాడు. అత‌ను ప్రస్తుతం విదేశాల్లో చదువుకుంటున్నాడు. అయితే అత‌డిని త్వ‌ర‌లోనే ఇండ‌స్ట్రీకి హీరోగా ప‌రిచ‌యం చేయాల‌ని వెంకీ భావిస్తున్నాడ‌ట‌. ఒక అద్భుతమైన స్టోరీ.. అందరికి అన్ని వర్గాలకు నచ్చేటట్టు.. ఎంటర్టైన్మెంట్ తో కూడిన కథని త్రివిక్ర‌మ్ సిద్ధం చేశార‌ని, ఈ సినిమాకి త్రివిక్ర‌మే ద‌ర్శ‌కుడని టాక్. దాదాపు వచ్చే ఏడాది మొద‌ట్లోనే అర్జున్ గ్రాండ్ డెబ్యూ మూవీ ఉండే అవకాశం ఉందని స‌మాచారం. ఇక వెంకటేష్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం దర్శకుడు శైలేష్ తో సైంధవ్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ని మెప్పించే విధంగా ఉంటుంద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...