Home Special Looks ‘మహానటి’ సినిమా అవకాశాన్ని చేజేతులా వదులుకున్న స్టార్ హీరోయిన్!
Special Looks

‘మహానటి’ సినిమా అవకాశాన్ని చేజేతులా వదులుకున్న స్టార్ హీరోయిన్!

Actress Who Lost The Chance To Work For Mahanati

అలనాటి నటి సావిత్రి జీవిత చరిత్రని ఆధారం చేసుకుని తెరకెక్కించిన సినిమా ‘మహానటి’. గొప్ప నటిగా ఆమె సినీ ప్రస్థానాన్ని చూపిస్తూనే.. వ్యక్తిగత జీవితంలో ఎలాంటి కష్టాలు అనుభవించిందో కూడా ఈ సినిమా ద్వారా బాగా చూయించే ప్రయత్నం చేసారు. ఐతే, ఇందులో సావిత్రిగా నటించి ఉత్తమ నటిగా 2019 సంవత్సరానికి గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ గెలుచుకున్న కీర్తి సురేష్ ఈ మూవీ కోసం ఎంచుకున్న ఫస్ట్ ఛాయిస్ కాదంటే నమ్మటం కాస్త కష్టమే.

కానీ అదే నిజం. సావిత్రి జీవిత కథని తెరకెక్కించాలని అనుకున్న తర్వాత నటీనటుల కోసం వెతికే సమయంలో నిత్యా మీనన్ ఈ కథకి బాగా సరిపోతుంది అనుకున్నారట. ఆమెని వెంటనే సంప్రదించిన తర్వాత ఓకే చెప్పడం కూడా జరిగిందట. కానీ, తర్వాత ఏమైందో తెలీదు. నిత్యా మీనన్ ఈ స్క్రిప్ట్ తో, మూవీ టీం తో ఎక్కువకాలం కలిసి పనిచేయలేకపోయారు. కొంతకాలం పాటు వాళ్ళతో కలిసే ఉన్నా.. తర్వాత తప్పుకున్నారు. ఐతే, మూవీ మేకింగ్ ని అనౌన్స్ చేయడం కోసం నిత్యా మీనన్ తో చేయించిన ఒక ఫోటోషూట్ కూడా వైరల్ అవ్వడం విశేషం.

కానీ, ఎలాగైనా మూవీని తెరకెక్కించాలి అనే ఉద్దేశంతో వెంటనే మరో నటి కోసం వెతకడం మొదలెట్టారు మూవీ టీం. అలా వాళ్ళకి కీర్తి సురేష్ ఎదురైంది. ఇక కీర్తి తనని తాను పాత్ర కోసం మలుచుకోవడం, మూవీ ఆద్యంతం అధ్బుతంగా నటించటం జరిగిపోయాయి. మూవీ ప్రేక్షకులకి కూడా విపరీతంగా నచ్చడం, సినిమాకి ఏకంగా ఉత్తమ నటి విభాగంలో నేషనల్ అవార్డ్ రావడం కూడా జరిగాయి. నిత్యా మీనన్ ఈ అవకాశాన్ని వదులుకోవడానికి కారణాలు ఏమైనా.. సినిమా సాధించిన విజయం, కీర్తి సురేష్ గెలుచుకున్న జాతీయ ఉత్తమ నటి అవార్డ్ ఖచ్చితంగా నిత్యాని రిగ్రెట్ అయ్యేలా చేసి ఉంటాయి కదా!

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Jabardasth Anchor: జాకెట్ విప్పి మరీ యువ‌త‌ని రెచ్చ‌గొడుతున్న జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్..క్రేజీ కామెంట్స్‌తో నెటిజ‌న్స్ ర‌చ్చ‌

Jabardasth Anchor: బుల్లితెర కామెడీ షోలో కామెడీనే కాదు గ్లామ‌ర్ షో కూడా భీబ‌త్సంగా ఉంది....

‘నిజం’ సినిమాలో తనని మోసం చేశారన్న రాశి!

ఆమె ఒకప్పుడు స్టార్ హీరోయిన్. కానీ తర్వాత అవకాశాలు తగ్గిపోతూ వచ్చాయి. మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో...

ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్లుగా మారిన హీరోలు!

హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ ఇలా ఏ భాషలో చూసినా సాధారణంగా ఒక విషయం గమనిస్తూ...

రాబోయే నెలల్లో భారీ అంచనాలతో రాబోతున్న సినిమాలివే..

సినీ అభిమానులు కరోనా కారణంగా చాలా కాలంగా థియేటర్ లో సినిమాలు చూడటాన్ని బాగా మిస్...