Home Special Looks త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్ అక్కినేని!
Special Looks

త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్న సుమంత్ అక్కినేని!

Akkineni Sumanth To Get Hitched Again

పవన్ కళ్యాణ్ హిట్ ఫిల్మ్ తొలిప్రేమ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మూవీ పెద్ద హిట్ గా మారడానికి గల కారణాల్లో ఒకటి పర్ఫెక్ట్ గా సెలక్ట్ చేసుకున్న హీరోయిన్ కూడా. ఆమెనే కీర్తి రెడ్డి. అందంతో పాటు.. పవన్ కళ్యాణ్ సరసన చక్కగా నటించిన ఫలితం మూవీ బ్లాక్ బస్టర్. ఐతే, 2004 లో ఆమె మరో సెలెబ్రిటీతో ప్రేమలో పడింది. అతను మరెవరో కాదు సుమంత్ అక్కినేని.

అక్కినేని నాగార్జున మేనల్లుడిగా, నాగేశ్వర రావ్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడనే చెప్పాలి. అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. వాటిల్లో ఏవీ భారీ హిట్లుగా మాత్రం మారలేదు. కానీ ఒక డీసెంట్ యాక్టర్ గా సుమంత్ మంచి మంచి సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతోంది. ఐతే.. అప్పటికి తన సినీ కెరీర్ తో పరవాలేదు అనిపించుకుంటున్న సుమంత్ ని పెళ్ళి చేసుకుంది కీర్తి రెడ్డి.

వాళ్ళిద్దరూ సంవత్సరం పాటు కలిసున్నారు. కానీ, తర్వాత ఏమైందో తెలీదు. ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటికే బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి వచ్చిన కీర్తి రెడ్డికి ఈ మ్యారేజ్ ఎపిసోడ్ ఎలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టిందో తెలీదు కానీ ఆమె సుమంత్ తో వివాహ బంధానికి గుడ్ బై చెప్పేశారు. ఐతే, వెంటనే అమెరికా వెళ్ళిపోయి మరో పెళ్లి చేసుకున్న కీర్తి రెడ్డి తన కొత్త జీవితంతో సంతోషంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ.. సుమంత్ మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికి 15 సంవత్సరాలు గడిచినా సుమంత్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.

ఇన్నేళ్ళు ఒంటరిగానే గడిపేసిన సుమంత్ తన ఇంట్లో వాళ్ళు సన్నిహితులు చాలాసార్లు మళ్ళీ పెళ్లి చేసుకొమ్మని చెప్పి చూసినా.. తనకి సరిపోయే అమ్మాయి దొరికితే ఖచ్చితంగా చేసుకుంటానని చెప్పేవాడట. సో, ఎట్టకేలకు సుమంత్ కి నచ్చిన అమ్మాయి దొరికిందని అనుకోవచ్చేమో ఈ మధ్యనే తన రెండో పెళ్లికి సంబంధించిన వార్త బయటికి వచ్చింది. అది కూడా ఒక wedding card ద్వారా. సుమంత్ తో కలిసి బ్రతకబోతున్న ఆ అమ్మాయి పేరు పవిత్ర. ఇంకా ఈ విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటికి రావాల్సి ఉంది. సుమంత్ ఆమెతో సంతోషంగా బ్రతకాలని కోరుకుందాం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...