Home Film News వైసీపీ మినిస్టర్ రోజా బాలీవుడ్లో నటించిన ఏకైక సినిమా ఏమిటో తెలుసా..!
Film News

వైసీపీ మినిస్టర్ రోజా బాలీవుడ్లో నటించిన ఏకైక సినిమా ఏమిటో తెలుసా..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలోనే సీనియర్ హీరోయిన్‌ల్లో ఒకరైన రోజా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి మొదట ప‌లు ఇబ్బందులు ఎదుర్కొన్న కూడా ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతుంది.

ఇక రోజా తెలుగు, తమిళంలోనే కాకుండా కన్నడ- మలయాళంలో కూడా ప‌లు సినిమాల్లో నటించి అక్కడి ప్రేక్షకులను కూడా మెప్పించింది. అయితే ఈమె సౌత్ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఈమె ఒక సినిమాలో నటించిన విషయం చాలామందికి తెలియదు. ప్రేమ తపస్సు అనే సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగు పెట్టిన రోజా.. శోభన్ బాబు హీరోగా వచ్చిన సర్పయాగం సినిమాతో న‌ట్టిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా తర్వాత నుంచి టాలీవుడ్ అగ్ర‌ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి హీరోలతో నటించి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే మరో స్టార్ హీరోయిన్ విజయశాంతి తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ఎక్కువగా నటించిన హీరోయిన్ గా కూడా రోజా పేరు తెచ్చుకుంది. హీరోయిన్గా అవకాశాలు తగ్గిన తర్వాత రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి మొద‌టిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలైంది.

మంత్రి రోజా నటించిన ఏకైక బాలీవుడ్ సినిమా ఇదే.. ఆ సినిమా రిజల్ట్ ఏంటంటే

ఆ తర్వాత వైసిపి పార్టీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఘ‌న‌ విజయం సాధించింది. అదేవిధంగా దర్శకుడు సెల్వమణిని వివాహం చేసుకుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. రోజా బాలీవుడ్‌లో నటించిన సినిమా విషయానికి వస్తే మహేష్ భట్ డైరెక్షన్లో వచ్చిన ది జెంటిల్మెన్ అనే సినిమాలో ఈమె ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మించగా చిరంజీవి హీరోగా నటించారు.. అయితే ఈ సినిమా బాలీవుడ్లో అంత పెద్దగా సక్సెస్ అవ్వలేదని చెప్పాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...