Home Film News Aarti Agarwal: ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోవ‌డానికి కార‌ణం ఆయ‌న తండ్రేనా.. నిర్మాత చెప్పిన సంచ‌ల‌న నిజాలు..!
Film News

Aarti Agarwal: ఆర్తి అగ‌ర్వాల్ చ‌నిపోవ‌డానికి కార‌ణం ఆయ‌న తండ్రేనా.. నిర్మాత చెప్పిన సంచ‌ల‌న నిజాలు..!

Aarti Agarwal: అప్ప‌ట్లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన అందాల హీరోయిన్ ఆర్తి అగ‌ర్వాల్‌. అందం, అభిన‌యం ఉన్న ఈ అమ్మ‌డు స్టార్ హీరోలతో క‌లిసి ప‌ని చేసింది.  2001 లో పాగల్పన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ అమ్మ‌డు  వెంకటేశ్ సరసన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో నటించి మంచి క్రేజ్ అందుకుంది. టాలీవుడ్‌లో  చిరంజీవి, ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు త‌రుణ్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఈ భామ ప‌లు కారణాల వ‌ల‌న ఆత్మ‌హ‌త్య చేసుకుంది. కాని అదృష్ట‌వ‌శాత్తు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఇక  2007 లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పెళ్లి చేసుకోగా, ఆ వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవలేదు.

2009లో అత‌నికి విడాకులు ఇచ్చిన ఈ భామ సినిమాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో  బరువు తగ్గించుకోవడం కోసం సర్జరీ చేయించుకుంది. దీంతో కొంత బ‌రువు త‌గ్గింది. అయితే మ‌రి కొంత త‌గ్గాల‌ని భావించిన ఆర్తి మ‌రోసారి స‌ర్జరీ చేయించుకోగా, అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. నడవలేక, ఊపిరి తీసుకోలేక చాలా ఇబ్బంది పడి చివ‌రికి చిన్న వ‌య‌స్సులో మృత్యువాత ప‌డింది. అయితే ఆర్తి అగ‌ర్వాల్ మ‌ర‌ణానికి కార‌ణం ఓ ర‌కంగా వారి త‌ల్లిదండ్రులే అని అన్నారు నిర్మాత‌. అల్లరి రాముడు.. ప్రభాస్‌తో అడవి రాముడు.. అల్లరి నరేష్‌తో యముడికి మొగుడు వంటి చిత్రాలు నిర్మించిన  సీనియర్ నిర్మాత చంటి అడ్డాల ఆర్తి మ‌రణం గురించి షాకింగ్ విష‌యాలు చెప్పారు.

ఆర్తి విషయంలో ఆమె తండ్రి క‌నుక‌ సరిగా ఉండి ఉంటే ఇలా అయి ఉండేది కాద‌న్నారు చంటి అడ్డాల.  ఆర్తి అగర్వాల్‌తో రెండు సినిమాలు చేసిన నిర్మాతగా నాకు ఆర్తి అగ‌ర్వాల్ మ‌ర‌ణం తీర‌ని విషాదాన్ని మిగిల్చింది. వాళ్ల ఫ్యామిలీ పూర్తిగా ఆర్తి మీద డిపెండ్ అయ్యారు. వాళ్లు ఎలా అంటే ఆర్తి అలా న‌డుచుకునేది. షూటింగ్‌కి ఆమెతో పాటు వాళ్ల పేరెంట్స్ కూడా వ‌చ్చేవారు. ఈమెతో ప‌ని స‌రిగా చేయించేవారు కాదు.  ఆర్తి అగర్వాల్ తండ్రి..ఏదో ఒక విష‌యంలో షూటింగ్‌కి అడ్డుపడిపోయేవాడు. వాస్త‌వానికి ఆర్తి ఆగర్వాల్‌కి ఆమె తండ్రితోనే స‌మ‌స్య‌.. ఆయన లేకపోతే ఆర్తి చాలా ఫ్రీగా పనిచేసేది. ఆర్తి..ఫేడౌట్ అయి, అలా అయిపోవడానికి కారణం ఆమె తండ్రే అని సంచ‌న‌ల కామెంట్స్ చేశారు చంటి అడ్డాల‌.

Related Articles

దివంగత శ్రీదేవికి.. ఎన్టీఆర్ దేవర సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? కొరటాల స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ దేవర.. పాన్ ఇండియా...

అది నాకు ఎప్పుడో తెలుసు.. నాగచైతన్య హీరోయిన్ సాయి పల్లవి గురించి సమంత హాట్‌ కామెంట్స్..!

ప్రస్తుతం ఇదే వార్త చిత్ర పరిశ్రమలో ఎంతో వైరల్ గా మారింది. ఇన్ని రోజులు ఎంతో...

బిగ్ బ్రేకింగ్: “షణ్ముఖ్” కేసులో బయటపడ్డ కొత్త కోణం.. అన్నిటికీ కారణం “యాంకరే” నా..?

షణ్ముఖ్ జస్వంత్ ఈ పేరు గురించి అందరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. యూట్యూబ్లో వచ్చిన...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...