Home Film News Prabhas: ప్ర‌భాస్‌కి రూ. 276 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందా.. ఇది నిజంగా రికార్డే..!
Film News

Prabhas: ప్ర‌భాస్‌కి రూ. 276 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందా.. ఇది నిజంగా రికార్డే..!

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌భాస్ ఆన‌తి కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్‌కి వ‌చ్చిన క్రేజ్ మాములుగా లేదు. ఆయ‌న‌కి జ‌పాన్‌లో సైతం అభిమానులు ఏర్ప‌డ్డారు. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్‌ని క‌లిసేందుకు చాలా మంది అభిమానులు ఆయ‌న ఇంటికి వ‌చ్చారు. ఇలా బాహుబ‌లి సినిమాతో భారీ క్రేజ్ దక్కించుకున్న ప్ర‌భాస్ ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఆయ‌న చేసిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందాయి. భారీ బ‌డ్జెట్‌తో వ‌చ్చిన ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇక రీసెంట్‌గా వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం కూడా పూర్తిగా నిరాశ‌ప‌ర‌చింది.

బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన క్రేజ్ మొత్తాన్ని ఇప్పుడు ప్ర‌భాస్ నాశ‌నం చేసుకుంటున్నాడ‌ని కొంద‌రు చెప్పుకొస్తున్నారు. బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత ఆయ‌న చేసిన మూడు సినిమాలు కూడా దారుణంగా డిజాస్ట‌ర్ కావ‌డం అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు.  అయితే ప్ర‌భాస్ ఖాతాలో చేరిన మూడు ఫ్లాప్ సినిమాలకు వచ్చిన నష్టాలను లెక్కవేస్తే ఇది ఒక రికార్డ్‌గా నిలిచిపోతుంద‌ని ట్రేడ్  పండితులు అంటున్నారు. సాహో చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి 290 కోట్ల రూపాయలకు జరగ‌గా, ఈ చిత్రం  ఫుల్ రన్ లో 230 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో ఆ చిత్రానికి 60 కోట్ల రూపాయల నష్టం  వాటిల్లింది.. ఇక రాధేశ్యామ్  ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 210 కోట్ల రూపాయలలు జ‌ర‌గ‌గా,  ఫుల్ రన్ లో కేవలం 84 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టింది, అంటే అక్షరాలా 126 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ఇక రీసెంట్‌గా వ‌చ్చిన ఆదిపురుష్ చిత్రం రూ.500 కోట్ల రూపాయ‌ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన‌ట్టు తెలుస్తుండ‌గా,  ఇప్పటి వరకు ఈ సినిమాకి 150 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే మరో 90 కోట్లు రాబట్టాలి. ఇది  దాదాపుగా అసాధ్యం అనే అంటున్నారు.తొలి మూడు రోజులు స‌త్తా చాటిన ఆదిపురుష్ త‌ర్వాత మాత్రం డీలా పడింది. ఏదేమైన ప్ర‌భాస్ త‌న మూడు సినిమాలకు 276 కోట్ల రూపాయిలు నష్టపోయారని, ఇది ఆల్ టైం రికార్డు అని అంటున్నారు.

Related Articles

ఇప్పటికీ జక్కన్న నాకు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు.. తమన్నాసెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

మిల్కీ బ్యూటీ తమన్నా చిత్ర పరిశ్రమలో ఈ పేరుకి ఎలాంటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో...

1000 కోట్లు ఇచ్చినా సరే అలా చేయను అంటూ తెగేసి చెప్పేస్తున్న ప్రభాస్.. ఎందుకో తెలుసా..!?

ప్రస్తుతం ఇండియన్ సినిమా చిత్ర పరిశ్రమలో భారీ స్టార్‌డంతో దూసుకుపోతున్న ప్రభాస్ పెళ్లి వయసు దాటుతున్న...

మహేష్ కోసం అవతార్ డైరెక్టర్ ను తీసుకొస్తున్న రాజమౌళి.. జక్కన్న స్కెచ్ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు ఇప్పటికే అధికార...

రామ్ చరణ్ ఫోన్ లో ఎన్టీఆర్ నెంబర్ ఏమని ఉంటుందో తెలుసా.. భ‌లే సిల్లిగా లేదు..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ టాలీవుడ్ లో అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా...