Home Film News Sunny Leone: త‌న త‌ల్లి తాగుడు వ‌ల‌న చాలా ఇబ్బంది ప‌డ్డాన‌న్న స‌న్నీ లియాన్..నా వ‌ల్లే అలా మారి ఉంటుంది..!
Film News

Sunny Leone: త‌న త‌ల్లి తాగుడు వ‌ల‌న చాలా ఇబ్బంది ప‌డ్డాన‌న్న స‌న్నీ లియాన్..నా వ‌ల్లే అలా మారి ఉంటుంది..!

Sunny Leone: కుర్ర‌కారు క‌ల‌ల సుంద‌రి స‌న్నీ లియాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 2000 ల ప్రారంభంలో అడల్ట్ ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఆ త‌ర్వాత హిందీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. అక్క‌డ స‌న్నీకి ఫుల్ ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో ఇక తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో కూడా ప‌లు చిత్రాలు చేసి మెప్పించింది.  స‌న్నీ ఒరిజిన‌ల్‌ పేరు కరెన్‌జిత్ కౌర్ వోహ్రా. కాగా,  స్టేజీ నేమ్ గా సన్నీ లియోన్‌గా మార్చుకుంది. మ్యాగ‌జైన్ సంస్థ వారి వ‌ల్ల‌నే త‌న పేరు అలా మారిన‌ట్టు తెలుస్తుంది. ఇక సన్నీ లియోన్ పేరు తన తల్లికి నచ్చేది కాదని ఓ సంద‌ర్భంలో చెప్పింది. త‌న త‌మ్ముడి పేరు సందీప్ సింగ్ కాగా, అంద‌రు ఇంట్లో త‌న‌ని స‌న్నీ అని పిలుస్తార‌ట‌.

తన తమ్ముడి పేరునే తన స్టేజీ నేమ్ గా ఎంచుకోవడం పట్ల తన తల్లి కాస్త ఆవేద‌న వ్య‌క్తం చేసింద‌ని, ఇన్ని పేర్లు ఉండ‌గా, ఆ పేరే నువ్వు పెట్టుకోవాలా అని త‌న త‌ల్లి త‌న‌ని  ప్ర‌శ్నించిన‌ట్టు చెప్పుకొచ్చింది స‌న్నీ లియోన్. తాను అమెరికాలో ఉండగా పోర్న్ చిత్రాల్లో నటించడం, తన తల్లి మద్యం అలవాటు తదితర విషయాల  గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది స‌న్నీలియోన్. త‌ను పోర్న్ చిత్రాలు చేయ‌డం వ‌ల్ల‌నే త‌న త‌ల్లి  మద్యానికి బానిసయ్యేందుకు ఓ కారణం అయ్యి ఉండొచ్చని  స‌న్నీ స్ప‌ష్టం చేసింది. అమ్మకు అప్పటికే మద్యం తాగే అలవాటు ఉన్నా కూడా  నేను పోర్న్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం కూడా నా త‌ల్లి మ‌ద్యానికి బానిస అయ్యేందుకు కార‌ణం అని కూడా చెప్పాలి.

నా క‌న్నా కూడా మా అమ్మ‌కు మందే ఇష్ట‌మ‌ని అనుకునేవాడిని. ఈ విష‌యంలో ఎప్పుడు గొడ‌వ‌లు జ‌రుగుతూ ఉండేవి. అయితే తాను మ‌ద్యానికి అంత బానిస కావ‌డానికి కార‌ణం మేము కామ‌ని త‌ర్వాత‌ తెలిసింది.అది ఓ మానసికమైన సమస్య. దీనికి నేను, నా సోదరుడు లేదా మా నాన్న బాధ్యులు కాము అంటూ సన్నీలియోన్ అని  చెప్పుకొచ్చింది. ఇక డేనియల్ వెబర్‌ను పెళ్లి చేసుకున్న సన్నీ చాలా సంతోషంగా ఉంది. ఆమెకి  ఇద్దరు పిల్లలు కాగా, మరో చిన్నారిని దత్తత తీసుకుంది. ప్ర‌స్తుతం ఇండియాలో ఉంటూ ప‌లు సినిమాల‌తో బిజీగా బిజీగా గ‌డుపుతుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...