Home Film News Laya: ల‌య అభిమానుల‌కి గుడ్ న్యూస్.. మెగా హీరో సినిమాతో టాలీవుడ్‌కి రీఎంట్రీ
Film News

Laya: ల‌య అభిమానుల‌కి గుడ్ న్యూస్.. మెగా హీరో సినిమాతో టాలీవుడ్‌కి రీఎంట్రీ

Laya: సీనియ‌ర్ హీరోయిన్ ల‌య ఇప్ప‌టి వారికి పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని  అప్ప‌టి ప్రేక్ష‌కుల‌కి మాత్రం చాలా సుప‌రిచితం. హోమ్లీ బ్యూటీగా ల‌య ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. విజయవాడకు చెందిన లయ ముందుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత స్వ‌యంవ‌రం సినిమాతో హీరోయిన్‌గా ఇండ‌స్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే త‌న ఖాతాలో పెద్ద హిట్ వేసుకున్న ల‌య ఆ త‌ర్వాత ప‌లువురు స్టార్ హీరోల‌తో కూడా ప‌ని చేసింది. ఆక ఆమె లోని టాలెంట్ బ‌య‌టపెట్టిన చిత్రం ప్రేమించు. ఇందులో అంధురాలిగా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది ల‌య. ఇండ‌స్ట్రీలో తాను ఉంది కొద్ది రోజులే అయిన‌ప్ప‌టికీ ల‌య వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.

హనుమాన్ జంక్షన్, నువ్వులేక నేనులేను వంటి కమర్షియల్ హిట్స్ సాధించిన ల‌య త‌న కెరీర్‌లో 50 కి పైగా చిత్రాల్లో నటించారు. 2006 వరకు లయ కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండేది. ఏదో ఒక సినిమా ఆమె ఖాతాలో వ‌చ్చి చేరేది. అయితే  2006లో కాలిఫోర్నియాలో డాక్టర్ గా సెటిల్ అయిన గణేష్ గోర్తి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ల‌య అక్క‌డే సెటిల్ అయిపోయింది.  ఇక ఈ దంప‌తుల‌కి ఇద్ద‌రు పిల్ల‌లు జ‌న్మించ‌గా, అప్పుడ‌ప్పుడు వారి ఫోటోల‌ని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఫ‌న్నీ వీడియోలు చేస్తూ నెటిజ‌న్స్ ని అల‌రిస్తూ ఉంటుంది.

ఇక ల‌య రీఎంట్రీ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె త్వ‌ర‌లోనే రీఎంట్రీ ఇవ్వ‌నుందంటూ అనేక ప్ర‌చారాలు సాగుతున్నాయి. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ల‌య‌.. మెగా హీరో రామ్ చ‌ర‌ణ్ సినిమాతో ల‌య రీఎంట్నీ ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతుంది.   ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా చేస్తోన్న చరణ్.. త్వ‌ర‌లో డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. ఇందులో ఓ కీలకపాత్ర కోసం మేకర్స్ హీరోయిన్ లయను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. టెస్ట్ సూట్ లో కూడా ల‌య పాల్గొంటుంద‌ని, త్వ‌ర‌లోనే ఆమె రీఎంట్రీపై ఓ క్లారిటీ కూడా ఇస్తార‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...