Home Film News This Week: ఈ వారం చిన్న సినిమాల‌దే హ‌వా.. ధియేట‌ర్, ఓటీట‌లో విడుద‌ల‌య్యే సినిమాలేంటంటే..!
Film News

This Week: ఈ వారం చిన్న సినిమాల‌దే హ‌వా.. ధియేట‌ర్, ఓటీట‌లో విడుద‌ల‌య్యే సినిమాలేంటంటే..!

This Week: ప్ర‌తి వారం కూడా ప్రేక్ష‌కుల ముందుకు వైవిధ్యమైన సినిమాలు వ‌స్తున్నాయి. థియేటర్స్, ఓటీటీలో వ‌చ్చే సినిమాల‌తో ప్రేక్ష‌కులు ఫుల్ ఎంట‌ర్‌టైన్ అవుతున్నారు. గ‌త వారం థియేట‌ర్‌లో చిరంజీవి భోళా శంక‌ర్, రజ‌నీకాంత్ జైలర్, ఉస్తాద్ చిత్రాలు సంద‌డి చేశాయి. ఈ వారం అయితే అన్ని చిన్న సినిమాల హంగామా క‌నిపించ‌బోతుంది. చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్‌, జై చిరంజీవ, మన్మధుడు, మళ్లీశ్వరీ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన విజయ్‌ భాస్కర్ చాలా కాలం త‌ర్వాత జిలేబి అనే చిత్రం చేయ‌గా, ఈ వారం విడుదల కాబోతుంది. ఇక‌ బిగ్‌బాస్‌ సోహేల్‌ హీరోగా మిస్టర్‌ ప్రెగ్నెంట్‌, సంతోష్‌ శోభన్‌ నటించిన ప్రేమ్‌ కుమార్‌, తమిళ స్టార్‌ కమెడియన్‌ సంతానం హీరోగా నటించిన డీడీ రిటర్న్స్‌ , పిజ్జా 3, హాలీవుడ్‌ డబ్బింగ్‌ బ్లూ బీటిల్స్‌ వంటి చిత్రాలలతో పాటు మరో నాలుగు చిన్న చిత్రాలు థియేటర్లలో  సంద‌డి చేయ‌నున్నాయి.

ఇక ఓటీటీలో  రిలీజ్ కానున్న సినిమాలు చూస్తే..ముందుగా  నెట్‌ఫ్లిక్స్‌లో .. అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదల అయింది,  నో ఎస్కేప్‌ రూమ్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న రిలీజ్ కాగా ప్ర‌స్తుతం స్ట్రీమ్ అవుతుంది.  డెప్‌ వర్సెస్‌ హర్డ్‌-డాక్యుమెంటరీ సిరీస్‌-ఆగస్టు 16న విడుదల,  గన్స్‌ అండ్‌ గులాబ్స్‌-హిందీ సిరీస్‌-ఆగస్టు 18న విడుదల,  మాస్క్‌ గర్ల్-కొరియన్‌ సిరీస్‌-ఆగస్టు 18న స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్‌ ప్రైమ్ లో హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌-వెబ్‌ సిరీస్‌-ఆగస్టు 18న స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక జీ5లో ఛత్రపతి-హిందీ-ఆగస్టు 15న విడుదలై స్ట్రీమింగ్ అవుతుంది. బుక్‌ మై షోలో  బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌-హాలీవుడ్‌- ఆగస్టు 15న విడుదల కాగా, డాంఫైర్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదల అయింది. స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌-హాలీవుడ్‌-ఆగస్టు 15న విడుదలై ప్ర‌స్తుతం స్ట్రీమ్ అవుతుంది. ఇక జియోలో   తాలీ-హిందీ-ఆగస్టు 15న విడుదల ఫ‌ సే ఫాంటసీ-హిందీ-ఆగస్టు 15న విడుదలై స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక ఈటీవీ విన్ లో అన్నపూర్ణ ఫొటో స్టూడియో-తెలుగు-ఆగస్టు 15 నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇలా ఈ వారం మొత్తం చిన్న సినిమాల హంగామా క‌నిపించ‌నుంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...