Home Film News Vijay Devarakonda: స‌మంత గురించి చెబుతూ చాలా బాధ‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆల్మోస్ట్ క‌న్నీళ్లు కూడా వ‌చ్చేసాయి..!
Film News

Vijay Devarakonda: స‌మంత గురించి చెబుతూ చాలా బాధ‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఆల్మోస్ట్ క‌న్నీళ్లు కూడా వ‌చ్చేసాయి..!

Vijay Devarakonda: మ‌హాన‌టి చిత్రం త‌ర్వాత స‌మంత‌,విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన చిత్రం ఖుషి. శివ నిర్వాణ  దర్శకత్వంలో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానుండ‌గా, మేక‌ర్స్ ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన   కొన్ని పాటలు, ట్రైలర్ ఆడియన్స్ ని మెప్పించాయి.  మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ చిత్రానికి అద్భుత‌మైన సంగీతం అందించ‌గా, ప్ర‌తి పాట శ్రోత‌ల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక చిత్ర బృందం  మంగళవారం (ఆగస్టు 15) రాత్రి హైదరాబాద్‌లో ‘మ్యూజికల్‌ కన్సెర్ట్‌’ను నిర్వహించ‌గా,  ఈ ఈవెంట్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత  లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి  అభిమానుల్లో జోష్ నింపారు.

ఇక విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. 2022 ఏప్రిల్‌లో ఖుషి సినిమా షూటింగ్ ప్రారంభించి చిత్రీక‌ర‌ణ వేగంగా చేశాం.  షూటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో సమంత తన ఆరోగ్యం బాగాలేదని చెప్ప‌డంతో మేము లైట్ తీసుకున్నాం. అందుకు కార‌ణం ఆమె చాలా  చక్కగా, గ్లామరస్‌గా కనిపిస్తోంది.. డాన్స్ చేస్తోంది. తనకేమైంది అనుకున్నాం. 3 రోజులు షూటింగ్ ఆపేస్తే సెట్ అవుతుందని భావించాం. కానీ, ఆస్పత్రిలో 2 వారాలు ఉంది. ఈ లోపు నేను మరో సినిమా ప్రమోషన్ వర్క్‌ కోసం వెళ్లిపోయా. ఆ సమయంలోనే సమంత హెల్త్ కండీషన్ గురించి తెలిసింది.  స‌మంత ప‌డ్డ క‌ష్టం మాములు క‌ష్టం కాదు. తనెప్పుడూ నవ్వుతూ ఉండటం చూడాలి. ఇప్పుడు కూడా స‌మంత‌కి హెల్త్ సపోర్ట్ చేయట్లేదు. తనకు లైట్లు, సౌండ్ ఇదంతా చూస్తే..తలనొప్పి వస్తుంది. కానీ, మన అందరి కోసం ఇక్కడికి వచ్చింది అని విజ‌య్ దేవ‌ర‌కొండ ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు.

స‌మంత ఆరోగ్యం గురించి మాట్లాడొద్ద‌ని నేను అనుకున్నాను. ఆమె నుంచి ఎంతో మంది స్ఫూర్తి పొందుతున్న వారున్నారు. డిప్రెషన్ నుంచి బయటపడుతున్నారు సమంతను కలవడం చూశా. వాళ్లందరూ ఇలాంటి సమస్యలను జయించిన వాళ్లే. కోవిడ్ తర్వాత చాలా మంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండ‌గా, అలాంటి  వారు  సమంత నుంచి స్ఫూర్తి పొందాలి. ఇలా ఉన్నా మన పని మనం చేసుకోవచ్చనేది చెప్పడానికే తను ఇక్క‌డికి వ‌చ్చింద‌ని విజ‌య్ అన్నారు. ఇక స‌మంత మాట్లాడుతూ చిత్ర బృందం త‌న‌ని ఎంతో స‌పోర్ట్ చేసింద‌ని చెప్పుకొచ్చారు. థ్యాంక్‌ గాడ్‌.. విజయవాడలో సమంత ఇడ్లీ స్టాల్‌ పెట్టుకునే పరిస్థితి రాలేదు అని పేర్కొంది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...