Home Film News NTR-Balakrishna: ఎన్టీఆర్- బాల‌కృష్ణ కాంబో సినిమా జ‌స్ట్‌లో మిస్ అయిందా.. అదేంటంటే..!
Film News

NTR-Balakrishna: ఎన్టీఆర్- బాల‌కృష్ణ కాంబో సినిమా జ‌స్ట్‌లో మిస్ అయిందా.. అదేంటంటే..!

NTR-Balakrishna: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని బ‌డా ఫ్యామిలీలో నంద‌మూరి ఫ్యామిలీ కూడా ఒక‌టి. నంద‌మూరి తార‌క‌రామారావు ఎన్నో అద్భుత‌మైన సినిమాలు చేయ‌డంతో పాటు ఇండ‌స్ట్రీ ఎదుగుద‌ల‌కి కృషి చేశారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత ఆ  లెగసీని  ఆయ‌న త‌న‌యుడు న‌ట‌సింహం నంద‌మూరి బాలకృష్ణ కాపాడుతూ వ‌చ్చారు.మాస్, క్లాస్ , డివోష‌న‌ల్ చిత్రాలు చేసిన బాల‌య్య ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌రిగా ఉన్నారు. ఇక  బాల‌య్య త‌ర్వాత నంద‌మూరి ఫ్యామిలీ స్థాయిని పెంచిన హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. తాత నట‌వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకుని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఎన్టీఆర్‌.. ఆన‌తి కాలంలోనే గ్లోబ‌ల్ స్టార్‌గా ఎదిగాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్‌కి ఫుల్ క్రేజ్ ద‌క్కింది.

నంద‌మూరి ఫ్యామిలీలో బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్‌కి మాత్ర‌మే మంచి క్రేజ్ ఉంది. అయితే వీరిద్ద‌రి మ‌ధ్య సరైన బాండింగ్ లేద‌ని స‌మాచారం. ఎప్ప‌టిక‌ప్పుడు వీరిద్ద‌రి గురించి ఏదో ఒక వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తూనే ఉంటుంది. వారిద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంద‌ని ప్ర‌చారాలు జ‌రుగుతుండ‌గా,  వాటిని నంద‌మూరి ఫ్యాన్స్ మాత్రం   కొట్టిపారేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. ఒకే ఫ్యామిలీ హీరోలు కూడా క‌లిసి న‌టిస్తున్నాయి. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి బ్రో చేశారు. ఇది మంచి విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే  బాల‌య్య‌, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా వస్తే చూడాలని అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ ఎదురు చూస్తున్నారు.

ఆ త‌రుణం ఇంకా రాలేదు.  అయితే సినీ ప్రియులకి  తెలియ‌ని విష‌యం ఏంటంటే.. గ‌తంలో ఎన్టీఆర్‌, బాల‌కృష్ణ కాంబోలో ఓ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ మిస్ అయిందట‌. మ‌రి  ఆ సినిమా ఏంట‌నే క‌దా మీ డౌట్…. సూప‌ర్ హిట్ చిత్రం `జనతా గ్యారేజ్`. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత‌,  నిత్య మీన‌న్ క‌థానాయిక‌లుగా న‌టించారు. మ‌ల‌యాళ స్టార్ మోహ‌న్ లాల్ ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. 2016 సెప్టెంబరు 1 న విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని అందుకుంది.  రూ. 55 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 135 కోట్లకు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది  . చిత్రంలో  మోహ‌న్ లాల్ పోషించిన పాత్ర కోసం బాల‌య్య‌ను అనుకున్నార‌ట‌.కాని చివ‌రి నిమిషంలో కొరాట‌ల బ్యాక్ స్టెప్ వేశాడు.  బాల‌య్య ఎన్టీఆర్ కాంబినేష‌న్ అంటే ప్రేక్ష‌కుల అంచ‌నాలు మించేలా ఉండాలి. అది గ్ర‌హించే కొర‌టాల .. బాలయ్య‌ని సంప్ర‌దించ‌లేద‌ని అంటున్నారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...