Home Film News సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవీ కామెంట్!
Film News

సుమంత్ రెండో పెళ్లిపై ఆర్జీవీ కామెంట్!

RGV Comments On Sumanth Second Marriage

అక్కినేని సుమంత్ ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయ తెలిసిందే. ఇప్పటికే ఒకసారి పెళ్లి చేసుకుని.. కీర్తి రెడ్డితో ఏవో అభిప్రాయ భేధాలు వచ్చి విడిపోయిన సుమంత్ ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయాడు. చాలా కాలం తర్వాత ఏమైందో ఏమో.. మళ్ళీ అతనికి నచ్చిన అమ్మాయి దొరికినట్లుంది. పవిత్ర అనే అమ్మాయితో పెళ్లికి రెడీ అవుతున్నాడు.

ఇంతవరకు బానే ఉంది కానీ.. ఈ విషయం రామ్ గోపాల్ వర్మకి తెలిసిపోయింది. స్వయంగా తన భార్య నుండి విడిపోయి.. పెళ్ళిలో ఉన్న లోటు పాట్ల గురించి ఎంతో మాట్లాడే ఆర్జీవీ.. సాటి సెలబ్రిటీ మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే ఆ విషయం మీద స్పందించాడు. “ఒకసారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ. ఆ పవిత్ర ఖర్మ. అనుభవించండి.” అని ఒక ట్వీట్ చేశాడు.

కానీ, అక్కడితో ఆగిపోలేదు. “ఒక పెళ్ళే నూరేళ్ళ పెంట ఐతే, రెండో పెళ్లి ఏంటయ్యా స్వామీ? నా మాట విని మానెయ్యి. పవిత్ర గారు మీ జీవితాల్ని పాడుచేసుకోకండి. తప్పు మీది కాదు. తప్పు ఆ దౌర్భాగ్యపు వ్యవస్థది.” యాంటీ ఇంకో ట్వీట్ చేశాడు. ఆర్జీవీ ఈ మధ్య పెళ్లిపై స్పార్క్ ఓటీటీలో మరో ఎపిసోడ్ చేస్తున్న విషయం తెలిసిందే.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...