Home Film News Adipurush: ఎట్ట‌కేల‌కు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త‌న పెళ్లిపై ఓపెన్ అయిన ప్ర‌భాస్
Film News

Adipurush: ఎట్ట‌కేల‌కు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త‌న పెళ్లిపై ఓపెన్ అయిన ప్ర‌భాస్

Adipurush: సినీ ఇండ‌స్ట్రీలో స‌ల్మాన్ ఖాన్ త‌ర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవరంటే ప్ర‌భాస్ అని ఠ‌క్కున చెబుతారు. ఆయ‌న తోటి వాళ్లంద‌రు పెళ్లిళ్లు చేసుకుంటున్నా కూడా ప్ర‌భాస్ మాత్రం నాలుగు ప‌దుల వ‌య‌స్సు దాటిన ఆ ఊసే ఎత్త‌డం లేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఇప్పుడు  తాను తెరకెక్కించే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండాలని దర్శక నిర్మాతలకు సూచిస్తున్నార‌ని  తెలుస్తుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సినిమాల విలువ సుమారుగా రూ.3000 కోట్లకి పైగా బడ్జెట్ తో రూపొందుతున్న‌ట్టు తెలుస్తుంది. అయితే ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16న విడుద‌ల కానున్న విష‌యం విదిత‌మే.

ఆదిపురుష్ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆదిపురుష్ టీం కనీవినీ ఎరుగని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది.. ప్రీరిలీజ్ వేడుకకు ప్రభాస్, కృతిసనన్, ఓం రౌత్ సహా ఆదిపురుష్ టీం స‌భ్యులు అంద‌రు హాజ‌రై సండి చేశారు. ప్రాంగ‌ణం మొత్తం జైశ్రీరామ్ జైశ్రీరామ్ అంటూ నినాదాలతో మారు మ్రోగింది. ఇక చివ‌రిగా ప్ర‌భాస్ త‌న స్పీచ్‌ని జైశ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ప్రారంభించారు. ద‌ర్శ‌కుడు ఓం రౌత్ అయితే కేవలం గంట రెండుగంటలు మాత్రమే పడుకుంటూ ఒక యుద్ధమే చేశారని అన్నారు. ఒక సందర్భంలో చిరంజీవి గారు  ఏంటి రామాయణం చేస్తున్నావా అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ అడిగారు.. అవును సర్ అని చెబితే ఈ అదృష్టం అందరికీ దొరకదు అని అన్నార‌ని  ప్రభాస్ ప్రీ రిలీజ్ వేడుకలో గుర్తు చేసుకున్నారు.

ప్ర‌భాస్ త‌న స్పీచ్ కొన‌సాగిస్తున్న స‌మ‌యంలోనే అభిమానులు పెళ్లి ఎప్పుడు  అని గోల చేస్తున్న క్ర‌మంలో  ప్రభాస్ సమాధానం అందరికి నవ్వులు పూయించింది. తిరుపతిలోనే చేసుకుంటాలే ఎప్పుడైనా అని చెప్పి ప్రభాస్ అనడంతో ఒక్క‌సారి సైలెంట్ అయిపోయారు. గ‌తంలో ప్ర‌భాస్‌కి అనుష్క‌కి మ‌ధ్య ఏదో న‌డుస్తుంద‌ని ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత కృతి స‌న‌న్ తో ప్ర‌భాస్ ఎఫైర్ న‌డుపుతున్న‌ట్టు ప్ర‌చారాలు చేశారు. కాని వీటిపై ఏ మాత్రం క్లారిటీ లేదు. ఇక ప్ర‌భాస్‌.. ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తా.. కానీ ఇలా వేదికపై తక్కువగా మాట్లాడుతా అని స‌ర‌దా వ్యాఖ్య‌లు చేశారు. చివరిగా జైశ్రీరామ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించాడు.

Related Articles

Betper bahis sitesi guncel giris 2023

Betper bahis sitesi guncel giris 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...