Home Film News Adivi Sesh: నాగార్జున మేన‌కోడ‌లితో అడివి శేష్ వివాహం.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్
Film News

Adivi Sesh: నాగార్జున మేన‌కోడ‌లితో అడివి శేష్ వివాహం.. త్వ‌ర‌లోనే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్

Adivi Sesh: ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీలు సైలెంట్‌గా ప్రేమ‌లో పడ‌డం, అనంత‌రం పెళ్లి పీట‌లు ఎక్క‌డం వంట‌వి చేస్తున్నారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి తో పాటు సిద్ధార్థ్‌- అదితి రావు హైద‌రిల ప్రేమ‌యాయణం హాట్ టాపిక్‌గా న‌డుస్తుంది. కొన్నాళ్లుగా ఈ జంట‌లు సైలెంట్‌గా ప్రేమాయ‌ణం న‌డుపుతున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లు కూడా ఎక్క‌బోతున్నార‌ని అంటున్నారు . అయితే కొద్ది రోజులుగా వీరి వ్య‌వ‌హారంపై జోరుగా ప్ర‌చారాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు నాగార్జున మేనకోడలు, హీరో సుమంత్ సొదరి సుప్రియ- యంగ్ హీరో అడివి శేష్ పెళ్లి వార్త ఒక‌టి అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ అయిన అడివి శేష్ ప్ర‌యోగాల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచాడు. ఆయ‌న చేసిన‌వి చాలా త‌క్కువ చిత్రాలే అయిన అవి మంచి హిట్ సాధించాయి. అయితే ఈ కుర్ర హీరో కొన్నాళ్లుగా అక్కినేని నాగార్జున మేనకోడలు, నటి సుప్రియతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ప్ర‌చారాలు సాగాయి. అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారాలు జ‌ర‌గ‌డం, ఆ త‌ర్వాత సైలెంట్ కావ‌డం జ‌రిగింది.కాని ఈ సారి మాత్రం ఏకంగా ఆమెతో కలిసి అడివి శేష్‌ ఏడడుగులు వేయబోతున్నట్టు చెప్పుకొస్తున్నారు. అంతేకాదు పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు.

 

జూన్ 16న వీరిద్దరూ అడివి శేష్, సుప్రియ‌లు పెళ్లి బంధంతో ఒక్క‌టి కాబోతున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటి వ‌ర‌కు అడవి శేష్ నుండి.. అక్కినేని ఫ్యామిలీ నుండి దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన రాలేదు. కాగా, అడివి శేష్ తో కలిసి సుప్రియ గూఢచారి అనే సినిమాలో నటించింది. అప్ప‌టి నుండి వీరిద్ద‌రి మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డింద‌ని అంటున్నారు. అడివి శేష్‌ సినిమాలకు సంబంధించిన ప్రతీ పనిలో సుప్రియ ఇన్వాల్వ్‌మెంట్ త‌ప్ప‌క ఉంటుంద‌ట‌. ఒక‌ప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సుప్రియ ఆతరువాత నిర్మాతగా మారింది. ఇటీవ‌ల కాలంలో స‌పోర్టింగ్ రోల్ పోషిస్తూ అల‌రిస్తుంది. సుప్రియ‌.. కొన్నేళ్ల క్రితం ఇష్టం హీరో చరణ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్నాళ్ల‌కు ఇద్ద‌రి మ‌ధ్య‌ మనస్పర్థలు రావడంతో అతడితో విడిపోయింది సుప్రియ. కొన్నాళ్ల‌కు అనారోగ్య సమస్యలతో చనిపోయారు చ‌ర‌ణ్‌.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...