Home Film News Agent: ఓటీటీ కోసం ఏజెంట్‌కి స‌రికొత్త రిపేర్లు.. పిచ్చి పీక్స్‌కి వెళ్లిందంటున్న నెటిజ‌న్స్
Film News

Agent: ఓటీటీ కోసం ఏజెంట్‌కి స‌రికొత్త రిపేర్లు.. పిచ్చి పీక్స్‌కి వెళ్లిందంటున్న నెటిజ‌న్స్

Agent: బడా ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చిన కూడా ఒక్క‌టంటే ఒక్క విజ‌యం కూడా అందిపుచ్చుకోలేక ఇబ్బందిప‌డుతున్నాడు అక్కినేని అఖిల్. తొలి సినిమాని త‌న పేరుతోనే విడుద‌ల చేసిన పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇక ఆ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసిన కూడా అవి కూడా బాక్సాఫీస్ ద‌గ్గర నిరాశ‌ప‌రిచాయి. అయితే బిగ్ సక్సెస్‌ను సొంతం చేసుకోవాలన్న కసితో అఖిల్ ‘ఏజెంట్’ అనే చిత్రాన్ని చేశాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కించారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం దారుణమైన ఫ్లాప్‌ని చ‌వి చూసింది.తొలి షోకే నెగెటివ్ టాక్ రావ‌డంతో ఓపెనింగ్స్ కూడా పెద్దగా రాలేదు.

త‌ర్వాత కూడా పెద్దగా ఆక‌ట్టుకోలేక‌పోయిన‌ ఈ చిత్రం చాలా తక్కువ వసూళ్లతోనే రన్‌ను ముగించుకుంది. ఫలితంగా భారీ నష్టాలను ఎదుర్కొని బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ‘ఏజెంట్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మే 19వ తేదీ నుంచి ఏజెంట్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు సోనీ లివ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందిన ‘ఏజెంట్’ మూవీ మే 19వ తేదీ నుంచే స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉన్నప్ప‌టికీ, ఈ ఆలస్యానికి కారణం ఎడిటింగ్ వర్క్ జరుగుతుండడమే అని అంటున్నారు

 

ఎడిటింగ్ వ‌ర్క్ వ‌ర్షన్ తో ‘ఏజెంట్’ చిత్రాన్ని థియేటర్స్ లో నచ్చని వాళ్ళు కూడా ఎగబడి మరీ చూస్తారంటూ మేకర్స్ బలమైన నమ్మకం తో ఉన్నారని అంటున్నారు. అయితే ఇది మూర్ఖ‌త్వ‌మే అని కొంద‌రు చెబుతున్నారు. అస‌లు ఫ్లాప్ అయిన మూవీని ఇలా ఎడిటింగ్ వ‌ర్క్ చేయ‌డం, దానికి ఖ‌ర్చు చేయ‌డం ఎందుక‌ని కొంద‌రు నెటిజ‌న్స్ అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకోవడంతో ఏపీ తెలంగాణలో మొత్తంగా 5.65 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక 10.65 కోట్ల గ్రాస్ వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 6.90 కోట్ల షేర్.. 13.35 కోట్ల గ్రాస్ వచ్చింది. కాగా సినిమా మొత్తం 30.10 కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు

 

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...