Home Film News Bhola Shankar: భోళా శంక‌ర్ ఫ‌స్ట్ సింగిల్ తెగ ఊపేస్తుందిగా.. 24గంటల్లో 10 మిలియన్లు
Film News

Bhola Shankar: భోళా శంక‌ర్ ఫ‌స్ట్ సింగిల్ తెగ ఊపేస్తుందిగా.. 24గంటల్లో 10 మిలియన్లు

Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాక భోళా శంకర్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్ర‌స్తుతం చివరి దశలో ఉంది.ఇప్పటివరకు రిలీజైన పోస్టర్‌లు సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఆగ‌స్ట్ 11న చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించ‌గా,  బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంది. ఇక రీసెంట్‌గా మూవీ నుండి ఫ‌స్ట్ సింగిల్ విడుద‌ల చేశారు. ఈ పాటకి మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చగా, రామ జోగయ్య శాస్త్రీ సాహిత్యం అందించారు. ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది.

స్వర సాగర్ అందించిన‌ మాస్‌ బీట్‌కు.. చిరు చేసిన గ్రేస్‌ ఫుల్ డ్యాన్స్ అభిమానుల‌కి పూన‌కాలు తెప్పించింది. ఊర మాసు బీట్‌కు.. మెగా స్టార్ గ్రేస్ తోడు కావ‌డంతో సాంగ్  చూడ ముచ్చటగా ఉంది. యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబ‌డుతుంది. కేవ‌లం 24 గంటల్లోనే దాదాపు 10 మిలియన్ రియల్ టైం వ్యూస్ రాబ‌ట్టింది. దీంతో మ‌రోసారి మెగాస్టార్ స్టామినా ఏంట‌నేది అర్ధ‌మైంది. సాంగ్ కి ఇంత భారీ రెస్పాన్స్ వ‌చ్చిన నేప‌థ్యంలో  సినిమాపై కూడా ఒక్క సారిగా అంచనాలు అమాంతం పెరిగాయి.  ఏకే ఎంటర్టైనమెంట్స్ నిర్మిస్తున్న భోళాశంక‌ర్  సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్ గా రూపొందుతుంది.

మెహర్ రమేష్‌ దాదాపు పదేళ్ల తర్వాత  భోళా శంక‌ర్ అనే  సినిమాతో మెగాఫోన్‌ పట్టాడు. 2013లో వచ్చిన షాడో తర్వాత మ‌ళ్లీ ఆయ‌న డైరెక్ట‌ర్‌గా  మరో సినిమా చేయలేదు. దాంతో ఇప్పుడు ఆయ‌న ఈ చిత్రాన్ని ఎలా తీయ‌బోతున్నాడు అనే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. మెహ‌ర్ ర‌మేష్ ఈ సినిమాపై ఎంతో శ్ర‌ద్ధ పెడుతున్నాడ‌ట‌.. ఎలాగైన చిరుకు అదిరిపోయే బ్లాక్‌ బస్టర్‌ ఇవ్వాలని మెహ‌ర్ ర‌మేష్ కృషి చేస్తున్న‌ట్టు స‌మాచారం. తమన్నా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ చిరుకు చెల్లెలుగా కనిపించనుండ‌గా, సుశాంత్ కూడా ముఖ్య పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...