Home Film News Adipurush: ఆదిపురుష్ ఆడే ప్ర‌తి థియేట‌ర్‌లో కూడా అత‌నికి ఓ సీటు అంకితం..టీం గొప్ప నిర్ణ‌యం
Film News

Adipurush: ఆదిపురుష్ ఆడే ప్ర‌తి థియేట‌ర్‌లో కూడా అత‌నికి ఓ సీటు అంకితం..టీం గొప్ప నిర్ణ‌యం

Adipurush: ఇప్పుడు ప్ర‌భాస్ అభిమానులే కాక యావ‌త్ సినీ ప్ర‌పంచం కూడా ఒకే ఒక్క సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. మరి ఆ చిత్రం మ‌రేదో కాదు ఆదిపురుష్‌. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రభాస్  రాముడిగా, కృతి సనన్  సీతగా, సైఫ్ అలీఖాన్   రావణాసురుడిగాఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ప‌లు వాయిదాల త‌ర్వాత చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుద‌లైన‌ ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై కూడా అంచ‌నాలు పెరిగాయి. ఇక చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా   జూన్ 6న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీ ఎత్తున‌ నిర్వహించబోతున్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా రాబోతున్నార‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ఇక భారీ అంచనాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ ఈ సినిమాకు టోటల్ రన్ టైం లాక్ అయ్యింది. ఈ చిత్రానికి దాదాపు మూడు గంటలు అంటే దాదాపు 2 గంటల 54 నిమిషాల మేర నిడివి ఉంద‌ని అంటున్నారు.జూన్ 6న సాయంత్రం 5 గంటల నుంచి  ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జ‌ర‌ప‌నుండ‌గా, ఈ వేడుక‌లో  చిత్రం నుంచి రెండో ట్రైలర్ కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది.   ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఉంటుందని  స‌మాచారం. ఇక ఈ సినిమాని పూర్తిగా ఆధ్యాత్మికంగా జై శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తూ జ‌నాల‌లోకి తీసుకెళ్తున్నారు.

ఆదిపురుష్ సినిమాను తెలుగులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ రిలీజ్ చేస్తుండ‌గా, ఈ  నిర్మాణ సంస్థ ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది. సినిమా రిలీజ్ గురించి, థియేట‌ర్స్ గురించి ఓ లెట‌ర్ షేర్ చేస్తూ..  రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు విచ్చేస్తాడు అనేది మ‌న అంద‌రి నమ్మకం.అందుకే ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ, ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ సినిమాని ప్రదర్శించే ప్రతి థియేటర్లో కూడా ఒక సీటు విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అతి గొప్ప రామ భక్తునికి గౌరవ మర్యాదలు సమర్పిస్తూ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఈ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వారు తెలిపారు. అత్యంత భారీ హంగులతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆదిపురుష్ చిత్రాన్ని హనుమంతుడి సమక్షంలో అందరం తప్పక వీక్షిద్దాం అని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...