Home Film News Salman Khan: భ‌ర్త‌తో 14 సార్లు ప్ర‌య‌త్నించా త‌ల్లి కాలేదు.. కాని స‌ల్మాన్‌తో..
Film News

Salman Khan: భ‌ర్త‌తో 14 సార్లు ప్ర‌య‌త్నించా త‌ల్లి కాలేదు.. కాని స‌ల్మాన్‌తో..

Salman Khan: బాలీవుడ్ కండ‌ల వీరుడు సల్మాన్ ఖాన్ వ‌య‌స్సు అయిదు ప‌దులు దాటినా కూడా ఇప్ప‌టికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గానే ఉన్నారు. ఆయ‌న జీవితంలో కొన్ని ప్రేమాయ‌ణాలు ఉండ‌గా, ప్ర‌స్తుతానికి అయితే  పెళ్లి ఆలోచ‌న లేన‌ట్టు క‌నిపిస్తుంది. అయితే తాజాగా స‌ల్మాన్ వ‌లన తాను త‌ల్లి అయిన‌ట్టు ఓ బాలీవుడ్ న‌టి తెలియ‌జేయ‌డం చ‌ర్చనీయాంశంగా మారింది.బిగ్ బాస్, ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి షోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామ కాశ్మీరా షా  2013లో టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్  ని వివాహం చేసుకుంది. ఈ జంట‌కి పెళ్లై ప‌దేళ్లు కాగా ప్ర‌స్తుతం త‌న భ‌ర్త పిల్ల‌ల‌తో సంతోషంగా ఉంది.

రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాశ్మీరా షో.. ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. మొద‌ట ఆమె బ్రాడ్ లిట్టర్‌మాన్‌ ను 2003లో వివాహం చేసుకోగా.. నాలుగేళ్ల త‌ర్వాత ఇద్దరి మ‌ధ్య ఏర్ప‌డిన  వ్య‌క్తిగ‌త‌ విభేదాలతో విడాకులు తీసుకుంది. ఇక కొద్ది రోజుల‌కి   కృష్ణ అభిషేక్ ను ఆమె వివాహం చేసుకుంది.వారి దాంప‌త్యంలో ఇద్ద‌రు పిల్ల‌లు జన్మించారు. ప్ర‌స్తుతం భ‌ర్త‌, పిల్ల‌ల‌తో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్న కాశ్మీర షా ..బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్  వ‌ల్లే త‌న‌కు పిల్ల‌లు పుట్టారంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేసింది.

వివ‌రాల‌లోకి వెళితే   కృష్ణ అభిషేక్ ని పెళ్లి చేసుకున్న త‌ర్వాత కాశ్మీర షా దంప‌తుల‌కు చాలా ఏళ్లు పిల్ల‌లు పుట్ట‌లేద‌ట‌. త‌న‌ భర్తతో 14 సార్లు ప్రయత్నించినా కూడా ఏ మాత్రం ఫ‌లితం లేకుండా పోయింద‌ట‌. ఎన్నో హాస్ప‌ట‌ల్స్ తిరిగిన కూడా,  చివరికి ఐవీఎఫ్ కూడా ట్రై చేసిన కూడా స‌క్సెస్ కాలేదు. పిల్లలు లేరని కాశ్మీర షా కుమిలి పోతున్న స‌మ‌యంలో సల్మాన్ ఖాన్ సరోగసి ప‌ద్ధ‌తిని ప్ర‌య‌త్నించ‌మ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఇక ఆయన సలహాతో పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తాము తల్లిదండ్రులయ్యామ‌ని.. సల్మాన్ వల్లే  ఇంత సంతోషంగా ఉన్నామ‌ని కాశ్మీర షా తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...