Home Film News Harihara Veeramallu: హ‌రిహ‌ర వీర‌మల్లు సినిమా అట‌కెక్కిన‌ట్టేనా, లేకుంటే సెట్స్ మీదే ఉందే.. క్లారిటీ ఇచ్చిన నిధి
Film News

Harihara Veeramallu: హ‌రిహ‌ర వీర‌మల్లు సినిమా అట‌కెక్కిన‌ట్టేనా, లేకుంటే సెట్స్ మీదే ఉందే.. క్లారిటీ ఇచ్చిన నిధి

Harihara Veeramallu: పాలిటిక్స్ వ‌ల‌న కొన్నాళ్ల పాటు సినిమాల‌కి దూరంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ .. వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఇక ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌రుస ప్రాజెక్టుల‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. భీమ్లా నాయ‌క్ చిత్రంతో కొద్ది రోజుల క్రితం  ప‌ల‌క‌రించ‌గా, ఇది మంచి విజయాన్ని అందుకుంది.జూలై 28న బ్రో అనే సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమా కోసం ప‌వ‌న్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న ప‌లు చిత్రాలు సెట్స్  పై ఉన్నాయి. వీటిలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం కూడా ఒక‌టి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుత‌న్న‌ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ని ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.

రెండేళ్ల క్రితం ప్రారంభ‌మైన‌ ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కూడా క‌రోనా, పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్, తదితర అంశాల కారణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. ఇక కొద్దినెలలుగా ‘హరిహర వీరమల్లు‘పై ఎలాంటి అప్డేట్స్ కూడా లేక‌పోవ‌డంతో చిత్రం అట‌కెక్కింద‌నే అనుమానాలు అంద‌రిలో మెద‌లుతున్నాయి. ఈ క్ర‌మంలోనిధి అగర్వాల్  పెట్టిన పోస్ట్ అభిమానుల‌కి కాస్త జోష్ అందించిందని చెప్ప‌వ‌చ్చు. తన ఇన్‌స్టాలో  హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు పోస్ట‌ర్ షేర్ చేస్తూ.. పవన్‌కల్యాణ్‌ తన అభిమాన నటుడని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో  తన కల నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.

చక్కటి కథాబలం ఉన్న ఇలాంటి చిత్రంలో భాగం కావడం  చాలా అదృష్టంగా భావిస్తున్నానని, ప్రేక్షకులు తెరపై ఓ అద్భుతాన్ని చూడబోతున్నారంటూ నిధి చెప్పుకొచ్చింది. నిధి చెప్పిన మాట‌లు చూస్తుంటే ఈ సినిమాని వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న చేస్తున్నార‌ని తెలుస్తుంది. ఇక  ఇటీవల పవన్‌కల్యాణ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ  ఇవ్వ‌గా, ఇందులో  తాను నటించిన కొన్ని సినిమాల క్లిప్సింగ్స్‌తో కూడిన వీడియోను షేర్‌ చేశారు. వాటిలో ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో నిధి అగర్వాల్‌తో తీయించుకున్న ఫొటో కూడా ఉండ‌డంతో , ఆ ఫొటో స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకుంటూ.. ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేసింది.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...