Home Film News Adipurush: ఆదిపురుష్‌కి అన్ని కోట్ల న‌ష్టం వాటిల్లిందా.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది..!
Film News

Adipurush: ఆదిపురుష్‌కి అన్ని కోట్ల న‌ష్టం వాటిల్లిందా.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగింది..!

Adipurush: ప్ర‌భాస్, కృతి స‌న‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఓం రౌత్ తెర‌కెక్కించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ఆదిపురుష్‌.జూన్ 16న విడుద‌ల కానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇక చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో నిన్న ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని తిరుప‌తిలో ఘ‌నంగా జ‌రిపారు. ఈ వేడుక  సినిమాపై అంచనాలను, హైప్‌ని అమాంతం పెంచేసింది అని చెప్పాలి.  ఇక ఈ వేడుక‌లో ఫైనల్‌ ట్రైలర్‌ని విడుదల చేసి ఫ్యాన్స్ కి స‌ర్‌ప్రైజ్ ట్రీట్ ఇచ్చారు మేక‌ర్స్ . ట్రైల‌ర్‌లో  యుద్ధ సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. యాక్షన్‌ సీన్లు అదర‌హో అనిపించాయి.

రావణుడు సీతని ఎత్తుకెళ్లిన నేపథ్యంలో .. రాముడు మాట్లాడుతూ..`వస్తున్నా రావణా.. న్యాయం రెండు పాదాలతోని పది తలల అన్యాయాన్ని అణచివేయడానికి.  వస్తున్నా నా జానకిని తీసుకెళ్లడానికి, ఆగమనం. ఆధర్మ విధ్వంసం`, `కానీ ఈ రోజు నాకోసం పోరాడొద్దు. భరతఖండంలోని స్త్రీలపై చేయి వేయాలని చూసే దుష్టులకి మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నుల్లో వణుకుపుట్టాలి. పోరాడతారా? అయితే దూకండి ముందుకు, అహాంకార రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి` అని రాముడిగా ప్రభాస్‌ చెప్పే డైలాగులు ప్ర‌తి ఒక్క‌రికి చాలా ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయ్యాయి. ఈ ట్రైల‌ర్‌తో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి.

ఆదిపురుష్ చిత్రానికి సంబంధించి  అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రారంభం  కాగా,  అక్క‌డ మూవీకి షోస్ దొర‌క‌డం ఇబ్బందిగా మారింది. ఆదిపురుష్ రిలీజ్ అయ్యే రోజే.. హాలీవుడ్ ప్రెస్టీజియస్ చిత్రం ‘ఫ్లాష్’ కూడా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో షోస్ అన్నీ కూడా ఆ సినిమాకే వెళుతున్నాయి.  టీ సిరీస్ సంస్థ ఆదిపురుష్ చిత్రానికి షోస్ ద‌క్కించుకోవ‌డంలో విఫలం అవుతుంది. ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్ ని చూస్తూ ఉంటే, ఈ సినిమా 5 లక్షల డాలర్స్ ని ప్రీమియర్స్ నుండి రాబట్టే ఛాన్స్  ఉంద‌ని అంటున్నారు.  1 మిలియన్ డాలర్లు రాబట్టాల్సిన సినిమా,అక్క‌డే ఆగిపోవ‌డం టెన్షన్ పెట్టిస్తుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ సినిమాకి నాలుగు కోట్ల రూపాయ‌ల న‌ష్టం వ‌స్తుంద‌ని అంటున్నారు.

Related Articles

Как играть в слоты Pinup казино?

Как играть в слоты Pinup казино?

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...