Home Film News Ramya Krishna: సౌంద‌ర్య ముఖం మీద కాలు పెట్టిన ర‌మ్య‌కృష్ణ‌.. దానికి ముందు అంత జ‌రిగిందా?
Film News

Ramya Krishna: సౌంద‌ర్య ముఖం మీద కాలు పెట్టిన ర‌మ్య‌కృష్ణ‌.. దానికి ముందు అంత జ‌రిగిందా?

Ramya Krishna: ఒక‌ప్పుడు ఇండ‌స్ట్రీలో హీరోయిన్స్ మ‌ధ్య తీవ్ర‌మైన పోటీ ఉంద‌నే విష‌యం తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన స‌రే కొన్ని స‌న్నివేశాల‌లో త‌ప్ప‌క న‌టించాల్సి వ‌చ్చేది. అప్ప‌టి హీరోయిన్స్ లో కూడా కొంద‌రు త‌మ గ్లామ‌ర్‌తో అల‌రించ‌గా, మ‌రి కొంద‌రు మాత్రం త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఎంతో మంది మ‌న‌సులు గెలుచున్నారు. ఆ నాటి హీరోయిన్ సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ.. న‌ర‌సింహా అనే చిత్రంలో న‌టించి ఎంత పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ర‌జనీకాంత్ హీరోగా కేఎస్ రవి కుమార్ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన న‌ర‌సింహా చిత్రం  1999లో మూవీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో  సౌందర్యపై ముఖంపై ర‌మ్య‌కృష్ణ‌ కాలుతో టచ్ చేసే సీన్ ఒక‌టి  ఉంటుంది.

ఈసీన్ పట్ల అనేక రూమ‌ర్స్ వ‌చ్చాయి. ఇది నిజం కాద‌ని డూప్‌తో చేయించార‌ని ప్ర‌చారం జ‌ర‌గ‌గా,  దీనికి సంబంధించి ఓ ఇంట‌ర్వ్యూలో ద‌ర్శ‌కుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. చిత్రంలో  సౌందర్యది చాలా సాఫ్ట్ క్యారెక్టర్ కాగా.. రమ్యకృష్ణది ప్రతికూల పాత్ర. నరసింహను దక్కించుకునే క్ర‌మంలో ర‌మ్య‌కృష్ణ అనేక ప‌న్నాగాలు ప‌న్నుతుంటుంది. అయితే ర‌మ్య‌కృష్ణ పాత్రకి ద‌ర్శ‌కుడు ముందుగా  నగ్మాను అనుకున్నారు. కానీ ఆ తరువాత రమ్యకృష్ణ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఆ పాత్ర‌కి నూటికి నూరు శాతం న్యాయం చేసింది.చిత్రంలో ర‌మ్య‌కృష్ణ  య‌జ‌మానురాలిగా, సౌందర్య పని మ‌నిషిగా న‌టించారు. ఓ సీన్ లో సౌందర్య త‌న భుజంపై ర‌మ్య‌కృష్ణ కాలు పెట్టుకొని మ‌సాజ్ చేయాల్సి ఉంటుంది.

సీన్ గురించి విన్న ర‌మ్య‌కృష్ణ.. అప్ప‌టికే స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సౌంద‌ర్యతో తను ఆ సీన్ చేయ‌లేన‌ని డైరెక్టర్ తో చెప్పిందంట. కాని డైరెక్ట‌ర్ చేయ‌క త‌ప్ప‌దు అని అన్నార‌ట‌.  రమ్య కృష్ణ మాత్రం సౌందర్య లాంటి హీరోయిన్ పై కాలు పెట్టడానికి అస్స‌లు ఒప్పుకోవ‌డం లేద‌ట‌. అప్పుడు స్వ‌యంగా సౌందర్యనే రమ్య కృష్ణకు భరోసానివ్వ‌డంతో.. సౌంద‌ర్య‌ మొహంపై తానే రమ్యకృష్ణ త‌న‌ కాలును పెట్టి ఆ సీన్ చేసింది. ఈ సీన్ తర్వాత రమ్య కృష్ణ బోరున తెగ ఏడ్చేసింది. ఈ సీన్ గురించి మాట్లాడిన కేఎస్ ర‌వికుమార్.. అక్క‌డ  ఆ  సీన్   తప్పకుండా  కాబ‌ట్టే చేయాల్సి వచ్చిందని అన్నారు.  సౌందర్యకు డూప్ గా న‌టించార‌ని ఆ స‌మ‌యంలో కొన్ని ప్ర‌చారాలు రాగా, ఆ సీన్‌లో  ఎవరూ నటించలేదని, సౌందర్య‌నే ఇలా చేసిందని చెప్పుకొచ్చారు.

Related Articles

Hizli mobil odeme canli bahis siteleri 2023

Hizli mobil odeme canli bahis siteleri 2023

Pawan: ప‌వ‌న్ బ‌ర్త్ డే రోజు బ‌య‌ట‌కి వ‌చ్చిన అస‌లు నిజం.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Pawan: ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు త‌న...

Pawan Kalyan: మ‌రో సినిమాకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ప‌వ‌న్ కళ్యాణ్.. జోరు త‌గ్గ‌ట్లేదుగా..!

Pawan Kalyan: ఇటీవ‌ల బ్రో సినిమాతో ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించిన ప‌వన్ క‌ళ్యాణ్ త్వ‌రలో మ‌రికొన్ని సినిమాల‌తో...

Tamannaah: మాల్దీవుల్లో బాయ్‌ఫ్రెండ్‌తో త‌మ‌న్నా ర‌చ్చ‌.. బాగా ఎంజాయ్ చేశారా అంటూ ప్ర‌శ్న‌

Tamannaah: సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకని సక్సెస్‍ఫుల్ హీరోయిన్‍గా స‌త్తా చాటుతున్న...