Home Film News చిరు అంజి సినిమాకి, వెంకటేష్‌కి ఉన్న లింక్ ఏమిటి..!
Film News

చిరు అంజి సినిమాకి, వెంకటేష్‌కి ఉన్న లింక్ ఏమిటి..!

చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కొందరు హీరోలు చేస్తేనే హిట్ అవుతాయి. మరికొన్ని సినిమాలు ఏ హీరో చేసిన కంటెంట్ బాగుంటే హీరోలతో సంబంధం లేకుండా భారీ విజయాలు అందుకుంటాయి. అయితే కొన్ని సినిమాలకు మాత్రం స్టార్ హీరోల అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమా స్టోరీని వాళ్లు మాత్రమే చేయగలరు. అదే విధంగా ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ కలక్షనల‌ రూపంలో రావాలంటే స్టార్ హీరోలు అయితేనే ఆ సినిమాకు సాధ్యమవుతుంది. కాబట్టి మంచి స్టోరీ దొరికితే భారీ బడ్జెట్ తో స్టార్ హీరోతో తీసి సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్క దర్శకుడు, నిర్మాత కోరుకుంటారు.

Venkatesh: Had it not been for Chiranjeevi, I would have gone to the Himalayas - Hindustan Times

అయితే గతంలో సీనియర్ దర్శ‌కుడు కోడి రామకృష్ణ తీసిన అంజి సినిమా పరిస్థితి కూడా ఇలాంటిదే. అయితే ఈ సినిమాని ముందుగా వెంకటేష్ తో చేయాలని కోడి రామకృష్ణ భావించారు. దానికి వెంకటేష్ కూడా ఓకే అని సినిమా చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఎవరు ఉహించ‌ని విధంగా ఈ స్టోరీని ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిరంజీవితో చెప్ప‌డంతో ఆయనకి ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చటంతో నేను ఈ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పారు.

ఇక దాంతో వెంకటేష్ కంటే చిరంజీవి మార్కెట్ చాలా పెద్దదని అప్ప‌టివరకు అనుకున్న వెంకటేష్‌ను ఆ సినిమా నుంచి తప్పించి ఆయన స్థానంలోకి చిరంజీవిని తీసుకొచ్చారు. అయితే ఈ సినిమా కన్నా ముందే వెంకటేష్, కోడి రామకృష్ణ కాంబోలో దేవీపుత్రుడు అనే సినిమా వ‌చ్చింది. అది ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో మళ్లీ వెంకటేష్ తోనే సినిమా చేయాలని కోడి రామకృష్ణ ఫిక్స్ అయ్యాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టులోకి చిరంజీవి వచ్చాడు.

Watch Anji (Telugu) Full Movie Online | Sun NXT

ఇక చిరంజీవి హీరోగా అంజి సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసినప్పటికీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఎందుకంటే అప్పుడు ఉన్న ప్రేక్షకుల స్థాయిని బట్టి ఆ సినిమా వాళ్లకి అడ్వాన్స్డ్ గా అనిపించడంతో ఆ టైమ్ కి ఆ స్టోరీని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఈ సినిమా లో గ్రాఫిక్స్ కూడా ఓవర్ గా ఉండడంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఈ ఏదో మ్యాజిక్ లాగా ఫీలయ్యారు. దానివల్లే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇలా వెంకటేష్ హీరోగా రావాల్సిన అంజి సినిమా చిరంజీవి హీరోగా వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్లాప్ సినిమాగా మిగిలిపోయింది.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...